పుట:Goopa danpatulu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
124

గోపదంపతులు.

గంగ--తప్పకవత్తును. మీదయకెంతయు గృతజ్ఞరాలను.

    ఇట్లుసంభాషించి యాస్త్రీలు తమబసకేగిరి. పాలమ్ము గంగమ్మ, సర్కసులో సాముగరిడీచేయు గంగమ్మాళయి దేశదేశముల వ్యాపించుకీర్తి సంపాదించుట, యవల నొక కేటీశ్వరుజేపట్టి గంగాబాయియై యఖండైశ్వర్యము అనుభవించుట, యెట్లు తటస్దించెనోగదాయని వారు పల్కుకొనుచు భగవంతుని వింతచెయిదముల కత్యాశ్చర్యము పడుచు బోయిరి.  వారు వెళ్ళినతర్వాతగూడ గంగాబాయి చాల సేపు చింతాసాగరమున మునిగియే యుండెను. అయ్యెడ  బ్రియుడువచ్చి 'ప్రియా! ఇప్పుడు నీకు దృప్తికలిగినదా?" యని యడిగెను. తానట్లు చింతతో నుంట ప్రియునకు గష్టముగా దోచునని యెంచి గంగాబాయి లెని సంతోషము దెచ్చుకొని యతనితో దనకంతయు దృప్తికరముగానున్నదని పెలికెను. "నేటి విందుకు నీమగడుకూడ వచ్చినట్లు నాకు బొడగట్టినది సుమీ!" యనియతడు పల్కెను. గంగమ్మ యాత్రముతో "మీరుమాటాడలేదా?" నేనిచ్చటనుండు టాయన యెఱుగునా?" యని ప్రశ్నించెను.  "నేనుమాటాడలేదు. దూరమునుండి  చూచితిని. నీయునికి యేమియు నతనికి దెలియదు, తెలిసిన నల్లరిచేయడా?"  యని మాఱుపల్కి భార్యతో శయనాగారములోనికి బోయెను.,