పుట:Goopa danpatulu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

121

తొటవిందు.

  నటే--ఇట్టినీతివాక్యములు పల్కువాడవు, నీవే గంగమ్మగర్భవతిగానుండగా మైలాపురములొనున్న మధురవాణి యింటికేగుచు దానితో గొన్నిమాసములు సుఖింపలేదా?
    రామ--అదిప్రేమచేగాదు, కామోద్రేకముచేగాని, నేనుమడి గట్టుకొంటినని చెప్పను. ఆవేశ్యాసంపర్కము తాత్కాలికముగా దెచ్చుకొన్నదేగాన్మి శాశ్వతముగా నిల్పుకొనదలచినది గాదు. అదియు నీవలననే సమకూడినదిగావున, నాపాపము నీయదే కాని నాది కాదు.
    నటే--అటైన మధ్యమధ్యంబున నట్టితాత్కాలికపు బేరముల కడ్డులేదందువుకాబోలు? సరే. నీయిష్టమెటు లో యటులేగావింపుము. నేనిక బోవలయును. 
    ఇప్పుడు రామయ్యతో వాదించిలాబములేదని యెంచి నటేశము లేచి తనబసకు బోయెను. రామయ్య ప్రియురాలి కడకు బోయెను. కాని యతడామెతో మాటాడుటకు వీలుచిక్కలేదు. ఏలయన గంగమ్మయు నొకముసలామెయు మఱి యిద్దఱు యువతులును గూడి యేదో మాటాడుకొను చుండిరి. రామయ్య తన పడకగదిలొనికేగి  యించుక తడవు మేను వాల్చెను. 
     ఆర్మొగముపిళ్ళగారి యత్తమామలు చెన్నపురమందే యుండిరి. మామగారికి 'బ్యాంక్ ' లోనొకగొప్పయుద్యొగము గలదు. ఆయనకూడ క్లబ్బులో నొకసభ్యుడుగావునను, బట్టణమందున్న గొప్పయుద్యొగులలో నొకడగుటచేతను రామ