పుట:Goopa danpatulu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
120

గోపదంపతులు.

గొలుపక మానదుసుమా! నిన్నుదైవసాక్షిగా బెండ్లియాడినది. నీవిప్పుడు వలచినకాంతకన్న నెన్ని మడుంగులో యందముగలది. కలలోనైన నిన్ను దప్ప నన్యులెఱుంగనిది, యాగర్భశ్రీమంతురాలు అట్టి నీ యిల్లాలి కిట్టివైభవములు లేకపోవుట మాత్రము బాగుగ లేదుసుమా?

  రామ--అన్నా! నీవు చెప్పినది నిజమే. కాని నాతప్పేమిగలదు? ఆమెకు నాభావములు పనికిరావే! నాకన్నిటవ్యతిరేకమేకదా! ఆమనసిగా నున్నన్నినాళ్లు నేను బరస్త్రీముఖము చూచితినా? నీవు చేసికొన్న భార్యను మోసగించి పాడుపోకలుపొవుచుంటివిగాని, నేనెన్నడేని యట్టులుంటినా?నాకు సరిపడనప్పుడు తప్పుదారులం బట్టవలసివచ్చెను.
    నటే--తప్పుదారులని నీవే యొప్పుకొనుచుంటివి గదా! ఇకనైన వానినిమానుటొప్పు. నామాటయందువా! పైపోకడలెన్నియున్నను, భార్యను బెండనాడుట లేదే ! గంగాబాయిని విడిచిపెట్టుమని నేనుజెప్పను. ఆమెను బల్లవరములోనే యుంచి యామెతొ నెడనెడ సుఖింపవచ్చును. ఇక్కడ నీభార్యనుంచి యామెతొ గూడ సఖ్యత వహించియుండుము. 
   రామ--అదియెన్నటికి సరిపడదు. గంగాబాయిని విడుచుట నాప్రాణమును విడుచుటే, ఆమె నుపేక్షించుట నన్నునేనుపేక్షించుకొనుటే. నాప్రేమ రెండు భాగములుగా బంచి యీయవలనుపడదు. నాప్రేమ రాజ్యమేలు రాణి యొక్కతెయే గాని పల్వురు గారు. అదియే గంగాబాయి.