పుట:Goopa danpatulu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

115

తోటవిందు.

ర్మము నేను నెఱపితిని. గొనియాడదగినదేదియు లేదని నాకేమియు బ్రత్యుపకరము వలదు." అనిపలికి తనదారి దానుబోయెను.

   ఆహా! యట్టి సౌశీల్యముగల పురుషపుంగవుని వీడి కేవల బాహ్యాడంబర పరుడగు నొకధనికుని మాయలకు లోనై గంగాబాయి తనకుజ్ దనజాతికి దుడిచివేయరాని మచ్చదెచ్చినదిగదా! అతనితత్త్వమే యామెకు బోధపడి  యున్న, నట్టి మాయా వాగులలో బడకపోవుగదా!

14. తోటవిందు

-(0)-

    గంగాబాయి కూతురు మృత్యుదేవతవాత బడక తప్పింపబడుటచేత మరల జన్మించినదని భావించి తలిదండ్రులు గొప్పయుత్సవం జేయసమకట్టిరి. దేవాలయములలో బూజాభిషేకములు గావించి బీదలకన్నదానముచేసిరి. మిత్రులకు బంధువులకు గొప్పతోటవిందొకటి చేయదలచి పట్టణమంతయు నాహ్వానపత్రికలతో నింపివైచిరి. కాస్మోపోలిటన్ క్లబ్బు సభ్యులతోబాటు మనయప్పలసామికిని నాహ్వాన మందెను. ఈవిందు గొప్పదగుటచే నిరివఱకు దేనికిని బోవకున్నను దీనికైనను బోయి కన్నులవేడుకయైన దీర్చికొందమని తలచి యప్పలసామి పోవ నిశ్చయించికొనెను. ఆవిందును నడపువాడు తన్ను మోసము జేసినవా