పుట:Goopa danpatulu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
116

గోపదంపతులు.

డనికాని, యావిందు తన్నుద్రోసిపుచ్చి యొరునితో గాపురముజేసి కన్న తన యిల్లాలిబిడ్డకై యనిగాని యతడెఱుగడు.

    వించు పూనమల్లి బాటమీదనున్న 'రామానంద విలాస ' మను భవనమందలి పుష్పవనములొ జేయ బడుచుండెను. ఆవనములొ జెట్టుచెట్టునకు నమర్చబడియున్న విద్యుచ్చక్తిచొదకతంత్రులచే దీపములు వెల్గింపబడెను. కొన్ని గొళాకారముగను, మఱికొన్ని చతురస్రములుగాను, వేరొకకొన్నియష్టభుజ పీఠాకృతిగను గురిచీలు నిలువబడి ప్రత్యాసనమూహ మద్యమందు నొక్కొక్కరకము మేజాబల్ల యుంపబడెను. ఒక్కొక్కకురిచీకెదుట బల్లమీద నెన్నియో వెండిపళ్ళెరములు, పాత్రములు, వివిధ రుచ్యాహారవస్తువులతొ నింపబడినవి. పెట్టబడి యుండెను. చలువమడుగుల గట్టి మూర్తీభవించిన నిర్మలదేవతలనదగి యున్న వారెందఱో వడ్డన చేయుటకు సిద్ధముగానుండిరి. అందు హైందవులలొ శాకాహారులెల్ల నొకప్రక్కను, దొరలును మాంసభక్షకులగు నితరహైందవులును, వేరొకప్రక్కను నాసీనులై యుండిరి. తత్రత్యఘనుల సంఘములో శాసననిర్మాణసభాసభ్యుడగు నొక పాశ్చాత్యుడు నాటిసమావేశమున కధ్యక్షుడుగ నెన్నుకొనబడెను.
    సాయంకాల మాఱుగంటల కంద ఱాసీనులయిరి. అధ్యక్షులు లేచి రామయ్యచెట్టిని గూర్చియు నతని యౌదా