పుట:Goopa danpatulu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
114

గోపదంపతులు.

త్యుముఖంబునుండి వెలువడిన బిడ్డనెత్తుకొని లాలించి దాని ప్రాణముం గాపాడిన యాపురుషుని గొనియాడి, దానిని తల్లిదండ్రుయొద్దకు గొనిపోయి యప్పగించి, జరిగిన కధయంతయు జెప్పెను. వారును దాములేచిన వేళమంచిదగుటచే నాపత్తునుండి వెలువడి తమబిడ్డ తమకు దక్కినదని సంతోషించుచు దమ శిశువునకు బ్రాణదానముచేసిన యపూర్వపురుషుని వేనోళ్ల బొగడుచు నింటికేగిరి.

     ఆర్తసంరక్షకుడగు నప్పలసామి నెవ్వరును గుర్తింపలేదు. అత డాంతరంగికదు:ఖముచే గ్రుసించి కృశించిపోయి యుండెను. అతడును దానొక సత్కార్యమును నాడు చేయగల్గితిని గదా యని సంతసించుచు దనదారిని బోయెను. కాని యతడాబిడ్డ యెవరిబిడ్డయో యరయలేదు. రక్షణోద్దేశము గలవారికి రక్షించుటే ప్రధానముగాని యితరవిషయములారయ బనిలేదు. ఆర్తియున్నవారు శత్రువులైనను మిత్రులైనను వారి కొక్కరూపే. అట్టి యకారణకారుణ్యముగల యార్తిత్రాణ పరాయణులు తమనామరూపములు గోప్యములుగా నుంతురు. అప్పలసామిని "నీవెవరు? మాబిడ్డను గాపాడినందులకు నీకు దగొమ బహుమాన మిప్పింతును. నీవేవిధినుందు" వని దాదొ యడిగి నప్పుడతడు "నేనెవడనైననేమి?ఒకమనుష్య్లుడను నోరెఱుగని కూనయొకటి యాపదనొందనున్నది. దానిని గాపాడ యత్నించుట మానవమాత్రునికెల్ల గర్తవ్యమే. గావున నాకును గర్తవ్యమే యైనది.నాధ