పుట:Goopa danpatulu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

119

ఆర్తరక్షణము.

ఆబంతి వంతెన కొకప్రక్క నడుగుననున్న యినుప కమ్ములకు నడుమ బడినది. శిశువు నిలువు గమ్ములలోనుండి తూఱి యడుగున బడియున్న కందుకము నందికొన యత్నించుచు గాలుజాఱి క్రింది ప్రవాహములో బడిపోవుచుండెను. కానియది తొడుగుకొన్న చొక్కాయందొక యినుపకొమ్మునకు దగులుకొనుటచే, నది క్రిందికి వ్రేలాడుచు గారు కారు నేడ్చుచుండెను. పిల్లయవస్ద కొంచెమేని దాదిగాని దాని యుపనాయకుడుగాని యెఱుంగకుండిరి. బిడ్డ విలవిల దన్నుకొనుటలో జొక్కా యంతకంతకు జరుగుచున్నది. దారినిబోవు వారెందరో యాశిశువునుజూచి గుంపుగూడి చూచుచుండిరి. కాని యొక్కరును సాహసించి దానిని రక్ష్మింపరైరి. క్రిందిప్రవాహముజూడ నగాధజలమయమై యున్నది. బిడ్డను గాపాడజూచిన దమప్రాణముకూడ గోల్పోవలసి వచ్చునేమోయని వారిభయము. ఇట్టులుండ నాదారిని మనయప్పలసామి పోవుచుండెను. అతడాగుంపును జూచి యందేమున్నదో కనుగొన బోయెను. ఆపదయందున్న బిడ్డనుజూచి యుత్తర క్షణముననే ప్రవాహములొ దుమికి యీదుచు బిడ్డ వ్రేలాడుచున్న వంతెనకంబము కడకు వచ్చి కంబము పైకి జేతులతొ నెగబ్రాకి, యొకక్షణములో బడిపోనున్న బిడ్డనుఇ బైకిదీసి, వినోదము జూచుచు నిలిచియున్న వారిలో నొకని కందిచ్చి, తాను మరల సురక్షితముగా నీది బయటికి వచ్చెను. ఇంతలో దాదియు నెత్తియు నోరును గొట్టుకొనుచు వచ్చి, మృ