పుట:Goopa danpatulu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
112

గోపదంపతులు.

నాసయుదగ్గుచుండెను. ఎప్పుడేని కనబడదా యని యతడూహించు నూహలన్నియు వట్టివగుచుండెను.

   గంగమ్మశిశువునకు శకుంతలయని పేరిడిరి. ఒకనాడు బిడ్డకు సుమారు పదునెన్మిది మాసముల యీడువచ్చినప్పుడు, రామయ్య ప్రియురాలితోను బిడ్డతోను బిడ్డదాదితోను బట్టణములో ‘వైట్వేలైడ్ లాండ్.ఆర్. అండ్ సన్సు, అనునంగళ్ళలో గొన్నివస్తువులు కొనుటకును, అనియుండవలెను. ‘డియాంజలిన్, లోగొందఱుమిత్రులతో గూడి యల్పహారములు పుచ్చుకొనిటకును బయలుదేఱిరి. వారు కొనదగిన వస్తువులు కొనుచుండ బిడ్డపోరుపెట్ట నారంభించెను. దానినూరార్చుటకు వారొక వింతత్రోపుడుబండిని గొనియిచ్చి దానియం దాశిశువును గూర్చుండబెట్టి యొకగంటదాక నందందుద్రిప్పి తీసుకొనిరమ్మని దాదితో జెప్పి, తాముకావలనవెల్లగొని ‘హోటల్ ‘లోనికి విందు గుడువ బోయిరి.
    ఈలోపున దాది బిడ్డబండి త్రోసుకొని ‘మౌంట్రోడ్ ‘ లో నొకప్రక్కగా బోవుచు గొంతదవ్వేగి ‘స్పెన్సరు ‘ వారియంగడికి దగ్గఱనుండు వంతెనకడ దనప్రియుడొకడు కనపడగా,బిడ్డను బండి నుండిక్రిందికిదింపి, యొకచెండుచేతికిచ్చి యాడుకొమ్మనిచెప్పి, తానును దనప్రియుడును సమీపముననే నిలిచి, సరసాలాడుకొనుచుండిరి. బిడ్డ బంతిని దొరలించు కొనుచు దవ్వేగియుంటయు వారు గ్రహింపకుండిరి.