పుట:Goopa danpatulu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

111

ఆర్తరక్షణము.

నాఱువనెలయరిసలనియు, దొమ్మిదవనెలతోటవిందు లనియు బండ్రెండవనెల పంక్తిభోజనములనియు, బేరులుబెట్టి యెన్నెన్నో పిండివంటలతో మిత్రబృందమునకు విందులు సలిపించినాడు.

    ఇట్టులా నూత్నదంపతులు రతీమన్మధులవలె, వసంతవిలాసముతొ, నత్యంతప్రేమతో, మహానందముతో రెండువసంతములు గడిపిరి. వారిబిడ్డకు మొదటియేడు నిండగానే వారు వర్దని త్యుత్సవమని పేరుపెట్టి  'కాస్మోపోలిటన్ క్లబ్బు ' సభ్యులనెల్ల దోటవిందుకు బిలిచిరి. దానికెల్లరును వచ్చిన గాని యప్పలసామి రాలేదు. అత డేయుత్సవ ములోనుం బాల్గొనుట మానెను.
   అప్పలసామి ఆంధ్రభవన్ లో 'గాఫీ ' బొజనము మున్నగునవి గావించుచు, మధ్యాహ్నము మూడు గంటలకే క్లబ్బునకు బోయి యేదొయొక క్రీడలో బ్రవేశించి ప్రొద్దుక్రుంకువఱకు నాడి యవల గడలి యెడ్డునకు బోయి చల్లగాలిననుబవించి యెనిమిది గంటల కిలుజేరును. తఱుచుగా క్లబ్బులో నేవియో విందులు వచ్చ్లు చుండును. వానిలొ నొక్కదానియందును నతడు పాల్గొనకుండెను. వానికి  నేటికిని దన భార్య రామయ్యగారి వద్దనే యున్నదని గాని, యొకస్త్రీ శిశువును గన్నదని గాని తెలియదు. నానాట వాని కామెయెడ