పుట:Goopa danpatulu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

93

పలాయనము.

శ్శాంతికి భంగకరమని తోచునేని, నేను మాయమ్మగారి యింటికేగెదనులెండు. నాచర్యలెల్ల మీకనుమానహేతు వులే యగునప్పుడు, మీతో గాపురముసేయుట కష్టమే

  అప్ప--నాకు నీతొడినదే లోకమనుకొనుచుంటిని. స్వర్గసౌఖ్యము నీపొందునందే కలదని యనుకొను చుంటిని. నీయెడ నాకెట్టి భావముకలదో, నాయెడ నీకును నట్టిభావమే కలదని దృఢవిశ్వాసముతో నుంటిని. అట్టివిశ్వాసమొక్క మారు చెఱిచివై చుటచే కాక, నన్నొక్కసారి నరకమునకు ద్రోయజూచుచుంటివే? నేనొరించిన యపరాధమేమి?
    గంగ--మీకుబిచ్చియె యెత్తింది. ఇక మీతో బ్రసంగింప జనదు. మీకున్నసందేహము లావల దీర్ప యత్నింతును. ఇప్పటికే చాలప్రొద్దుపోయినది. భోజనమునకు లెండు.
    అప్ప--సరియే అటులేగావింతును. నీవులోనికేగి యన్నియు నాయత్తపఱుపుము.
    గంగమ్మలోపలికి బోయెను. బర్త పలికిన జాలిమాటలామె గుండె గరిగించినవి. తానుజేయునది దోషమని తొచినది. ఎటులేని తనమనస్సు దిట్టపఱ చుకొని రామయ్యను నిరాకరింప నిశ్చయించు కొన్నది. కొంతసేపటికి నప్పలసామి దంతధావనా దికములు దీర్చుకొఇ భుజింపనేగెను. ఇరువురుని భుజించి యొకింత తడవు విశ్రమించిరి. మధ్యాహ్నము  'టీ ' పుచ్చుకొన్న వెంటనే యతడు రంగస్దలికి బోవలసిన పని