పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

89

దివ్యపురుషుని కాంతిలో తాను లయమైపోతూ, ఆ స్థితికి నిత్యత్వం సంపాదించుకో గలదా?

ఆయనవేళ్ళు తన ముంగురుల నెట్లు సవరించగలవు? ఆయన చూపులు తనచూపులలో ఎట్లు సంగమించగలవు? అతన తనతో వర్ణనాతీత పరమరహస్య సంభాషణలు ఏనాడు జరుపగలరు?

‘గజదొంగ’ యట! ఏమిటా గజదొంగతనము? తన హృదయాన్ని దొంగిలించడంలోమాత్రం ఆయన ‘గజదొంగ’ కావచ్చు. ఏకాలమందైనా, ఏబాలిక అయినా ఇలా తనవలె తన సర్వాధినాథుడైన పురుషుని స్మరిస్తూ నిద్రరాక కాలమంతా కరిగి ఒకే మహాప్రవాహంలా ప్రవహించేటట్లు ఆలోచించుకుంటూ ఉండ గలదా?

‘గజదొంగవా స్వామి! కన్న మేతువ ఏమి!

స్వజన దూరాగతను విజితురాలను నీకు.’

అని కూనిరాగంతో పాడుకుంటూ అ హంసతూలికాతల్పంపై దొర్లుతూ మూడవయామపుఘంటిక కోటమొగసాలలో కొట్టిన కొద్దివేళకు ఆమె గాఢనిద్రా పరవశురా లయింది.