పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమగాథ

ఓరుంగల్లు

1

ఓరుంగల్లు ఎనిమిది లక్షల పౌరులు సుఖంగా కాపురంచేసే మహానగరం. రెండు గవ్యూతుల వెడల్పు, మూడు గవ్యూతుల పొడుగు గల కోటనగరము. ఆ కోటచుట్టు మహానగరము ఉన్నది. తీర్చిన వీధులు, పెద్ద చెరువులు, చిన్న సెల యేరులు, తోటలూ, దేవాలయాలూ, విపణీవీధులతో ఆ మహానగరానికి ఈడైన మహానగరము దక్షిణాపథమందుకాని, ఆర్యావర్తమునందుకాని లేనేలేదు.

కోటనగర మధ్యమందు మహారాజుల కోట ఉన్నది. ఆ కోటయే పెద్ద పురమంత ఉన్నది. కోటలో ఏకశిలకు తూర్పుగా మహారాజ శుద్ధాంతాలు, మహారాజ నగరులు ఉన్నాయి. ఉత్తరంగా, వాయవ్యంగా స్వయంభూదేవేశ్వరాలయం, కేశవ దేవర గుడి, ఏకవీరాదేవిగుడి ఉన్నవి. నైరుతిగా పడమట కోట తటాకం, ఈ తటాకాన్ని ఆనుకొని రాజోద్యానమూ ఉన్నవి.

స్వయంభూదేవాలయంకడకు నాల్గు మహావీధులు కూడుతాయి. ఆ దేవాలయానికి తూర్పువీధినంటి రాజబంధువుల మందిరా లున్నవి. చక్రవర్తి హర్మ్యం పావు గోరుతం పొడవు వెడల్పు ఉంటుంది. ఆ మహాభవనాల చుట్టూ ఎత్తయిన గోడ లున్నాయి. వానికి తూర్పుగా ప్రధానామాత్య శివదేవయ్యవారి హర్మ్య మున్నది. ఆ భవనానికి దక్షిణంగా దుర్గపాలకుడైన ప్రసాదాదిత్యనాయనింవారి సౌధాలున్నాయి. వానికి తూర్పుగా మహారాజాతిథిభవనా లున్నవి. ఆ భవనాలకు తూర్పుగా తంత్రపాల ప్రోలనాయనింవారి సౌధా లున్నవి. అ సౌధాలకు దక్షిణంగా ప్రోలనాయనింవారి కుమారులైన ఎక్కినాయని, రుద్రినాయని, పినరుద్రినాయని, పోతనాయనింవారల సౌధా లున్నాయి. వీ రందరు సేనాపతులు.

ఏకశిలకు పడమటగా కుమార రుద్రదేవమహారాజులకు అంగరక్షకులైన తంత్రపాల వల్లయనాయకులవారి సౌధాలున్నవి. ఇంక దక్షిణంగా మారమరాజులంవారి, ప్రోలనాయనింవారి భవనా లున్నాయి. చక్రవర్తి నగరులకు ఉత్తరంగా మహాసేనాపతియైన రుద్రనాయనింవారి భవనా లున్నాయి. ఆయన ఏకశిలానగర పాలకుడు. నగరసైన్యాధ్యక్షుడు నాగచమూపతి, నాగచమూపతి మామగారయిన మేచయ నాయకుడు ఎంతకాలమునుంచో తలవరిగా నున్నాడు. మేచయనాయకుని