పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

గోన గన్నా రెడ్డి

మత్తగజముపైనా, నిస్సాణమ్మోసే గజము ముందుననూ భరింపరాని దుర్వాసనలు వెద జిమ్ముతూ గంధకబాణములు మండుతూ పడుతున్నవి.

ఆ పొగలకు ఏనుగులు రెండూ ఉక్కిరి బిక్కిరి అయి ధైర్యాలను వీడి అగ్ని బాణాలకు చిందర వందరై పారిపోతూ ఉన్న ఆదవోని సైన్యాలను వీడి కృష్ణలోకి ఉరికి ఎటు వీలయితే అటు పారిపో ప్రయత్నం చేసినవి.

బేడ చెలుకినాయని ఏనుగున్ను, అతని విజయనిస్సాణగజమున్ను గన్నారెడ్డి సైన్యాలకు చిక్కాయి. తక్కిన సైన్యాలను గన్నారెడ్డి పారిపోనిచ్చాడు.

గన్నారెడ్డి: బేడ చెలుకినాయకప్రభూ! నీ విక్రమానికి మా జోహారులు. అయినా ఈ గజదొంగ మాయలముందు నీవీమి నిలవగలవయ్యా! కాబట్టి నువ్వు నీ ప్రభువు కోటారెడ్డి మహారాజుగారి మనస్సు త్రిప్పు, శ్రీ రుద్రదేవ మహారాజు స్త్రీ యే. ఆవిషయంలో మీరందరూ అనుమానించినది నిజం. ఏమీ సందేహంలేదు.

బేడ చెలుకి: ఆడది ఎప్పుడైనా నా రాజ్యం చేసినదయ్యా!

గన్నారెడ్డి: ఇప్పుడు ఎందుకు చేయకూడదు? ఆమె దివ్యస్త్రీ. ఆమె అవతార మెత్తిన లలితాంబ!

బేడ చెలుకి: గన్నారెడ్డి! నువ్వు గజదొంగవా?

విఠలధరణీశుడు: మేము గజదొంగలం, దారిదోపిడిగాళ్ళం.

గన్నారెడ్డి: మా దొంగతనాలకు అడ్డంరాని కారణంచేత చక్రవర్తన్నా, ఆయన కుమారి శ్రీ శ్రీ రుద్రదేవ ప్రభువులన్నా మాకు భక్తి.

బేడ చెలుకి: అధర్మయుద్దం చేసి నన్నోడించావు.

గన్నారెడ్డి: ఓయి వెఱ్ఱిప్రభూ! నేను ఇంతవరకు ఎప్పుడూ అధర్మ యుద్దం చేయలేదు. అన్నాంబికాదేవి మా అక్కగారి నగరంలో ఉంటున్నది. మా అక్కగారిని పట్టుకోడానికి వచ్చావు కాబట్టి నీ ప్రసిద్ధనిస్సాణము మేము అపహరిస్తున్నాము.

7

కాకతీయవంశానికి సేవకులై, మహాసేనాపతులై, మహామాండలికులై మల్యాలవంశ్యులు ప్రసిద్ధిపొందిరి. ఈ వంశముపోరు ఇటు బుద్ధపురములో అటు కొండపర్తిలో ప్రభువులై రాజ్యం చేస్తూ ఉండిరి.

ఓరుగల్లు మహానగరానికి నైరుతిగా డెబ్బదిగవ్యూతుల దూరంలో శాలివాహనుల కాలమునుంచి ప్రసిద్ధికెక్కిన బుద్ధపురమనే నగరం రాజధానిగా గణపతిదేవ - ప్రసాద - ప్రసూత ప్రాచ్యరాజ్యలక్ష్మీ సమాశ్లిష్ట దక్షిణ భుజదండుండును, సమర సమయాఖండలుండును, సంకినపురాధినాథరిపు తిమర