పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

65

వేసికొన్న ఆడముండ” అన్నాడట! “దొరసానమ్మగారూ! అప్పుడు గన్నారెడ్డి తెల్లటి మంటతో మండే రోహిణీకార్తెనాటి మధ్యాహ్నసూర్యుడై, ‘ఛీ నోరు మూయుము పాపీ!’ అని లేచి ఫెళ్ళున వందిభూపాలుని చెంప పగులగొట్టి, చేయిబట్టి బరబర సింహాసనంమీదనుంచి లాగి, ‘పిశాచీ! నీ సింహాసనం నీకే ఉంచి, శ్రీ శ్రీ రుద్రదేవులకు దాసుడ వౌతావేమో అని నిదానించాను. కాని మనుష్య జన్మయెత్తిన అతిహీనుడుకూడ భక్తితో రుద్రదేవుల పేరు తలుచుకుంటాడు. గజ దొంగనయినా నేను మన చక్రవర్తి బిడ్డ నెవరు హీనంగా మాట్లాడినా వానిప్రాణం కొంటానని ప్రతిజ్ఞ పూనినాను. నువ్వు నాకుకూడ అపశయం తెస్తావు’ అని పలికి ఒకతన్ను తన్నినాడట. ఆవేళలో గన్నారెడ్డిని ఎవ్వరూ తేరి చూడజాలకపోయినా రంటమ్మా దొరసానమ్మగారూ! వందిభూపాలుడు గుఱ్ఱమెక్కి ఎక్కడికో వెళ్ళి పోయానాడట. అతనితో ఒక్క వీరుడైనా వెళ్ళడానికి నిరాకరించాడట. ఆ ప్రభువు భార్య ఇదివరకే కాలగతిపొంది కైలాసము చేరింది. కుమారుడు తలవాల్చివచ్చి గన్నారెడ్డికి తనకత్తిని సమర్పించి మాటలేక నిలుచున్నాడట. ‘తమ్ముడూ! ఈ రాజ్యం నీది. చక్రవర్తికి సేవచేస్తూ ధర్మం నాలుగుపాదాలా నడుపు’ అని గన్నారెడ్డి చెప్పి కోటలోనికి చక్రవర్తి విరోధులను రానీయవలదని చెప్పి తన సైన్యాలతో మాయమైనాడట. రెండుదినాలక్రిందట సంగమేశ్వరంలో వందిభూపాలుడు తాను చేసిన పాపాలకు నివృత్తిగా గండకత్తెర వేసికొన్నాడటమ్మా!” అని చంచలాక్షి అన్నమాంబికకు చెప్పింది.

ఆ మాటలన్నీ స్మృతిపథానికి రాగా అన్నాంబిక గవాక్షంలోనుంచి తాను చూసే శుభముహూర్త నిశ్చయోత్సవం మరచి ఆ గన్నారెడ్డినే హృదయంలో నింపికొన్నది.

3

‘గజదొంగ అయిన పురుషునికి సార్వభౌమునిపై భక్తి ఎట్లు?’ అని అన్నాంబిక తన తోటలో విహరిస్తూ ఆలోచింపదొడంగెను.

ఈసారి ఆ గజదొంగ తన వివాహము తప్పిస్తాడా? పెళ్ళికుమారుణ్ణి ఆలాగు ఆదినాన ఎత్తుకొనిపోవడానికి కారణం వివాహం తప్పించడానికా? కాకపోతే, మరెందుకు? ధనానికి ఆశపడలేదు. అహంకృతిచేతనా? లేక వట్టి కక్షచూపించడానికా? లేక ‘జాగ్రత్త’ అని పినతండ్రిని హెచ్చరించడానికా?

వివాహం తప్పించ నవసర మేమున్నది? ఏమో అతడు గజదొంగ అగుటకు వెనుక ఏ మహాచరిత్ర ఉన్నదో? దాసీలమాటలలో పినతండ్రి అతని రాజ్యం అపహరించడంవల్లనూ, చక్రవర్తి ఆ విషయంలో ఏమీసహాయం చేయకపోవ