పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చంద్ర 10 సం. అంగారక 7 సం. బుధ 17 సం. గురు 12 సం. శుక్ర 20 సం. శని 19 సం. రాహువు 18 సం., కేతువు 7 సంవత్సరాలుగా మొత్తం పురుషాయు:ప్రమాణం 120 సంవత్సరాలు లెక్కించి ఈ దశల్లో మరల అంతర్దశలు విభజించి వాని ప్రభావాల ఫలితాలు చెబుతారు. ఇది శాస్త్రీయమని అన్నా చెప్పినవన్నీ జరుగుతున్నాయా అనేది సందేహస్పదమే. వివాహాలకు లగ్నాలూ, శుభకార్యాలకు ముహూర్తాలు దీన్ని ఆధారం చేసుకొనే పెడు;తుంటారు. చెప్పింది జరగకపోతే అది పార్వతీదేవి శాపమంటారు.

                            సా ము ద్రి కం

జీవితరేఖ, హృదయరేఖ, శిరోరేఖ, అదృష్టరేంఅ, విద్యారేఖ, కుజరేఖ, వివాహరేఖ, గురు, శని, రవి, బుధ, చంద్ర, శుక్ర, కుజ స్థానములు, బొటనవ్రేలు, అరిచేతిరంగు వగైరా అధారంగా హస్తసాంద్రికం చెబుతారు.

ఎలక్ట్రానిక్, ఆటమిక్ శక్తులతో పురోగమిస్తున్న అమెరికావంటి పాశ్చాత్య దేశాలలో కూడా దీనికి గొప్ప గిరాకీవుంది. ఇంగ్లీషులో షీరో, బెన్హం అనే పండితులు పామిస్ట్రీ గ్రంధాలు వ్రాశారు. తెలుగులో వీని కనువాదాలేగాక సూర్యసాముద్రికం వంటి స్వతంత్ర గ్రంధాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇంగ్లీషు పద్దతికీ, తెలుగు పద్దతికీ ముఖ్యమైన తేడాలు వాళ్ళ హృదయరేఖ అనే దాన్ని మన వాళ్ళు జీవితరేఖ అంటారు. ఇంగ్లీషువాళ్ళ శాస్త్రం అరచేతికి పరిమితం. మనగాళ్ళు శాస్త్రం వ్రేళ్ళకు కూడా విస్తరించారు. (వ్రేళ్ళ కణుపులను సాసులుగా నిర్దేశించడం, వ్రేళ్ళపైభాగాలలొ శంకుచక్రాలు గుర్తించడం). ఇరువురికీ రేఖలూ, గ్రహస్థానాలూ, అధారాలు, మగవారికి కుడిచెయ్యి, ఆడవారికి ఎడమచెయ్యి చూస్తారు. చదువు, వివాహం, సంతానం, విదేశయానం, గండాలు, లాటరీలు, ఎగుడు దిగుళ్ళ వగైరా విషయాలు భవిష్యత్తులో ఏఏసందర్బాలలో ఏమేం జరుగుతాయి చెబుతుంటే చెప్పించుకొనేవాళ్ళూ మంత్రముగ్దులై వింటుంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారం రాబోయే అదృష్టాన్ని తలుచుకుంటూ మురిసిపోతూ రూపాయి చెల్లించేసి రాజాలా పోతుంటారు. రాజమండ్రి జంతర్ మంతర్ రోడ్దులో ఇంగ్లీషు తెలుగుల్లో ప్రవాహంలాంటి సాంకేతిక పదోచ్చారణతొ సైకిలు ప్రక్క నిలబడి చెప్పే యీసాముద్రికుల చుట్టూ ఎప్పుడూ జనమే.