పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చినాదైతే రంగుదారాలతో వెరుముక్కకట్టి రెండురూపాయలు పుచ్చుకుంటుంది. ఈ వేరుముక్కలకీ,దిగదుడుపులకీ ఆ జబ్బులు తగ్గిపోతాయని చాలామంది నమ్మకం.

                             సో ది

"సోదోయమ్మ సోది, సోదడగరండమ్మా సోది" అని మిట్ట మధ్యాహ్నం వేళ చిన్న ఏక్ తార తంబుర నొకదాన్నిచేత్తో మీటుతూఆశ్రితిలోగొంతులకలిపి పాటలా మాటలు పలుకుతూ సోదికత్తలు వీధుల్లో తిరుగుతుంటారు. సోది చెప్పించుకునే ఆమె చేటలో మూడు సోలల బియ్యం పోసి ఎదురుగా కూర్చొని చెయ్యి చాపుతుంది. సోదికత్తె ఆమె చేయి స్పృశిస్తూ, ఆమెకు సంతానం, పిల్లలు, పెళ్ళిళ్ళు, ప్రయాణాలు, భార్యాభర్తల సంబందం, ఆర్ధిక పరిస్థితులు, వగైరా ఎన్నో విషయాలు ఎడతెగని వాగ్ధోరణితో చెప్పుకు పోతుంటుంది. మగవాళ్ళని పుంజనీ, ఆదవాళ్ళని పెట్టనీ, పుంజంటే గడ్డం, పెట్టంటే బొట్టు అని పలికే సంజ్ఞా పరిభాష వీళ్లదే; ఆమె ఆ చెప్పడంలోనే చెప్పించుకునేవాళ్లనుండి తనకు కావలసిన సమాచారం రాబట్టుకు చెబుతుందనేది ప్రతీతి. ఏమైనా వీళ్ళు కూడా ఆడవాళ్లని బాగా ఆకట్టుకొని బియ్యం శేర్లకొద్దీ దండుకు పోతుంటారు. ఇందులో ఎక్కువగా పనిచేసేది పరేంగిత జ్ఞానం.

                    జాతక చక్రాలు

ఈపదతి కాళిదాసు కాలం నుంచీ కనిపిస్తోంది. గుప్తరాజుల స్వర్ణకాలంలో వరాహమిహురుడు దీనిపై ఒక సిద్దాంతమే ప్రతిపాతించాడు. పుట్టినతేదీ, నక్షత్రం ఆధారంగా రాశి చక్రం వేసి లగ్నం కట్టి, గ్రహస్థానాలు నిర్ణయించి, ఆగ్రహాల ఆగ్రహానుగ్రహాల ననుసరించి ఏతేదీకి ఏది కలిసొస్తుందో, ఏసమయానికి ఏచెడు జరుగుతుందో, శుభాశుభాలు, ఉద్యోగాలూ, పెళ్ళిళ్ళూ ఒకటేమిటి సమస్తమూ చెబురారు. అవిజ్రగటం జరగపోవటం అటుంచితే యిది ఒకసిద్ధాంతం ప్రాతిపదికగా చెప్పబడే శాస్త్రం అని తెలుస్తోంది.

ఇది సంస్కృతం నుండీ తెలుగులోకి వచ్చింది. పుట్టిన సమయపు నక్షత్రాన్ని బట్టి చక్రంవేసి దశావశేషం కట్టి గ్రహచలనాన్ని రవి 6 సం.