పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉపాసకులు

వీరిలో దేవీ ఉపాసకులు, హనుమదుపాసకులు, క్షుద్రదేవతారాధకులు అనేక రకాలు; దేవి ఉపాసకులు కాళికాదేవినిగాని, లలితాదేవినిగాని, దుర్గనుగాని ఉపాసిస్తారు. హనుమదుపాసకులు వీరాంజజేయం పూజ చేస్తారు. క్షుద్ర దేవతారాధకులు భేతాళును, ఎర్రమాచికమ్మ, కర్ణపిశాచి వంటి క్షుద్రదెవతలను మధ్యం, మాంసం, రక్తం నివేదన చేసి ఆరాధిస్తారు. కొందరు అర్ధరాత్రి స్మశానాలలో కపాలాలమధ్యా పూడ్చిపెట్టిన శవాలమీదా కూర్చుని జపాలు చేస్తారు. ఈ క్షుద్రదేవతలు అలాకోడినో, కుక్కనో కోసి అరాధించినంతకాలం వాళ్ళ ప్రభ ఫెళ్ళున పేలించేస్తాయట. నివేద్న ఏరోజున చెయ్యకపోతే ఆరోజున వాళ్ళనే తినేస్తాయట అన్నాడు మాతాత ఒకసారి. ఇది విన్న మాఅన్న "అయితే రాజకీయ నాయకులు కూడా క్షుద్రదేవతలే" అన్నాడు. కారణం, వాళ్ళు కూడా వాళ్ళ భజనచేస్తూ తిరిగినంతకాలం పైకెత్తాస్తారట. ఎప్పుడు మానెస్తే అప్పుడు తొక్కేస్తారట.

ఇంతకీ వెరంతా ఉపాసనబలంతో జోస్యం చెబుతారు. ఇందులో వాక్సుద్ది ముఖ్యం. వీరు మనిషిని చూసి అతని గతం, భవిష్యత్తు కళ్లకుకట్టినట్టు చెబుతుంటారు. చెప్పేవాటిలో ఒకటి రెండు గట్టిగా హత్తుకుంటాయి. దానితో చెప్పించుకొనేవాడు దాసోహమనేస్తాడు. వీరిది ప్రధానంగా 'ఇన్టూషన్ ' అంటారు. ఇళ్ళలో చిన్నా పెద్దా గొంగతనాలు జరిగినప్పుడు గొంగవలెవరో తెలుసుకోవడానికి పోలీసుష్టేషను కంటే ముందు వీళ్ళ దగ్గరకె పరుగుపెడుతుంటారు చాలామంది. కొంతమంది ఎదుటవారి జేబులో డబ్బులెన్నో కూడా లెక్కచెప్పేస్తారు. (దీనికి బిక్కవోలు ఆకుల సత్యనారాయణ మంచి ప్రసిద్ధి పొందేడు) ఈమధ్య పట్టణాలలో లాడ్జింగుల్లోకూడా వీళ్ళు మకాం పెట్టి జోస్యాలు చెబుతుంన్నారు. వీళ్ళు చెప్పే రాజకీయ జోస్యాలు పత్రికల్లోకూడా ప్రముఖంగానె వస్తున్నాయి. పెద్దపెద్ద దేశనాయకులే వీళ్ల వెంటబడుతున్నారు.

ఒకసారి ఓ కాళీ ఉపాసకుడు ఒకరిని మీ ఇంట్లో ఈశాన్యణ్భాగంలో మూడునిలువుల లోతులో లంకెంబిందెలున్నాయి జపహోమాలకు వెయ్యి రూపాయలు తెస్తే తీసిస్తానన్నాడట. ఇతను వెంటనే ఆ వెయ్యీ మీరే