పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పొలకమారితే ఎవరో కావలసినవాళ్లు తలచుకుంటున్నారంటారు. ఏపనికైనా ముగ్గురు బయలుదేరితే అది ముక్కలై పోతుందట. (కార్య నాశనం). కాకి అరిస్తే బంధువులు వస్తారంటారు. గడపమీద గుమ్మితే వారి తలమీద, గడపమీద పసుపునీళ్ళు చల్లుతూ 'చిరంజీవ ' అంటారు.

ఇంట్లో మొండిచేయి మొలిస్తే (పుట్టుగొడుగు మొండి ఛెయిలా మిలిస్తే) ఆ యింటికి అరిష్ఠమంటారు.

వీనిలో నిజమెంతున్నా, అబద్ధమెందుతున్నా వారి జీవిత గమనానికి జానపదులు ఏర్పాటుచేసుకున్న లక్ష్మణరేఖలు ఇవి.

వర్షాలు కురవకుంటే ఒక బాదురుకప్పను పట్టుకొని పసుపురాసి బొట్టెట్టి పసుపు గుడ్డలో కట్టి రోకలికికట్టి ఆ రోకల్ని యిద్దరుపిల్లలు మోస్తూ యింటింటికీ ఊరేగింపుగాతీసుకేళితే గడపగడపకూ పళ్లాలతో పసుపు కుంకుమ, పువ్వులు పెట్టి పంపిస్తారు. దీనికూడా పిల్లలు పుల్లలతో కోలమీద వాయిస్తూ.

                      "కప్పల తల్లీ నీళ్లాడే
                        జ్కడవల నిండా వానాకురిసే"
                     

అని పాడుతూ ప్రతి గుమ్మానికి తీసుకెళతారు. ఇలా కప్పను పూజిస్టే వాన వస్తుందనేది జానపదుల విశ్వాసాలలొ ఒకటి.

ఈ వర్షాలకోసం ఊరంతా శివాలయంలో హోమాలు చేయించి ఆఖరున శివుని తలమెద వేలాది బిందలనీళ్లు గుమ్మరించి గుడినింపేస్తారు. వెంటనే వర్షం పడుతుందని వారి విశ్వాసం. దీనికోసం దేవుని ముందర వందలాది కొబ్బరికాయలు కూడా కొట్టి ఆ నీళ్లతో అభిషేకిస్తారు. ఈ కొబ్బరికాయ కొట్టడంలో ఒక జానపద విజ్ఞాని చెప్పిన మాటయిది. క్షుద్రదెవతలకు నోరున్న జంతువుని బలియిస్తారట. సాత్విక దేవలకు నోరులేని జంతువుని బలి యివ్వడమట యిది. కొబ్బరికాయ మొక్క వస్తుందిగనక అదిప్రాణే. ఆ కాయలోని నీరు శరీరంలో రక్తంలాంటిదని, గుంజు మాంసంలాంటిదని, పై పేంకు చర్మంలాంటిదని, అందువల్ల ఒక కొబ్బరికాయ పగలగొట్టడమంటే ఒకజంతువును బలివ్వడమే అని భావమట