పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిల్లిమాయ దొరికితే అది ఇంటిలో పాతిపెడితే ఆ ఇంటిలో బంగారం తులతూగుతుందట.

ఇంటిమీద తీరువు పిట్ట అరిస్తే ఆ ఇంటికి అరిష్టమట. ఆ ఇంట్లో చావు బ్రతుకుల్లో ఉన్న రోగి అవరైనాఉంటే ఖాయంగా చచ్చిపోతారని దాని అర్ధమట. అలాగే వీధుల్లో కుక్కలు చేరి మొయ్యోమని మోరపైకెత్తుకొని అరుస్తుంటే కూడా ఆ వీధిని అవరింట్లోనైనా చావు బ్రతుకులలో మనిషి ఉంటే ఇక చచ్చిపోతాడని నిర్ధారణ చేసుకొంటారు. అతని ప్రాణాలు తీసుకెళ్ళడానికి వచ్చిన యమకింకరులు ఆ కుక్కలకు కనిపించి అలా అరుస్తుంటాయని వారి భావన.

ఆకాశంలో తోకచుక్క పొడిస్తే దేశంలో గొప్పవాళ్ళు ఎవరో చచ్చి పోవడముగానీ, ఏదైనా ఉపద్రవం రావడంగానీ జరుగుతుందట.

ప్రయాణం వెళ్ళేటప్పుడు ఒక తుమ్ము తుమ్మితే కార్య నాశనం. రెండుతుమ్ములు తుమ్మితే విజయం అని విశ్వాసం. అలాగే వెనక తుమ్ముముందుకు మంచిది అంటారు. (ఈ వెనక అనేది బయలుదేరిన తరువాతనా లేకవెళ్ళేవారి వనకనా అనేది ప్రిస్థితిని బట్టి సరిపెట్టుకుంటారు).

గ్రహణ కాలంలో ఏమైనా తింటే కడుపులో శూలపోట్లు వస్తాయని గ్రహణ సమయానికి ముందుగానే భొజనాలు పూర్తిచేస్తారు. గ్రహణ సమయంలో గర్భవతులు కదిలితే పిల్లలు గ్రహణంమొర్రితో పుడతారట. దేవుడుగుడికి వెళ్లి దైవదర్శనం చేసిన తర్వాత సరాసరి వచ్చేయక కాసేపు ఆలయంలో కూర్ఛోవాలట.

మనిషి నెత్తి మీద పిట్టరెట్ట వేస్తే మేలు జరుగుతుందంటారు. ప్రయాణ వాహనము మీద కుక్క మూత్ర విసర్జన చేస్తే ఆ ప్రయాణం విజయం అంటారు.

చావు పరామర్శకు వెళ్లినప్పుడు పరామర్శించి నేరుగా తిరిగి ఇంటికి వచ్చేయాలిగాని మధ్యలో ఎవరి ఇంటికీ వెళ్లరాదంటారు. కాళ్ళు బారచాపుకు కూర్చున్నవాళ్ల కాళ్ళు దాటితే మళ్లీ ఇటువైపుకు దాటమంటారు. ఇలా చేయకుంటే ఎవరికాళ్ళు అయితేదాటారో వారు స్త్రీ అయితే భర్త, పురుషుడైతే భార్య చనిపోతారనేది ఒక వాడుక.