మరణించిన వార్త వచ్చింది. ఇది సత్యదేవుని మహత్తే అని తెలిసికొని వ్రతం చేసుకుంటాను అని సంకల్పించాడు. వాళ్లు బ్రతికారు.
ఈ వ్రతానికి ఎర్ర గోధుమరవ్వ, బెల్లం కలిపి చేసే ప్రసాదం ప్రత్యేకత. ఖర్చు యిలా యీ ప్రసాదఖరీదూ., వ్రతంచేయించిన పురోహితునకిచ్చే సంభావనగా మాత్రమే. అందరికీ అందుంబాటులో ఉండే వ్రతం - జానపదులలో బాధామయ జీవితాలకు సేద తీర్చే వ్రతం.
త్రి నా ధ వ్ర తం
ఇదికూడా దరిద్ర నివారణకు చేసే వ్రతమే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పూజ. వారికి ప్రతీకలుగా మూడు కలశాలు పెట్టి పూజిస్తారు. ఈ వ్రతాన్ని 'మేళ ' అని కూడా అంటారు. ఇది సాయంత్రం పూజ, త్రిమూర్తులకు గంజాయి ధూపం యీవ్రత ప్రత్యేకత.
పూర్వం ఉజ్జయినీ నగరంలో ఒక బ్రాహ్మణుడు కటికదరిద్రంతో బాధపడుతూ జీవిస్తున్నాడు భార్యతో. ఒక కుర్రవాడు పుట్టేడు. తల్లికి పాలులేవు. ఎలాగో తంటాలుపడి భిక్షమెత్తి ఒక ఆవును కొన్నాడు పాలకోసం. ఒక రోజు అది తప్పిపోయింది. దానిని వెతకడానికి బయలుదేరిన ఆ పేద్ బ్రాహ్మణుడు దూరతీరాలు కూడా గాలించాడు. దొరకలేదు. ఇంటిస్థితిని తలుచుకుంటే పాలులేక పిల్లవాడి ఏడుపు సముదాయించలేక తల్లి ఏడుపు-ఇదంతా ఆలోచిస్తూ భగవంతుడా! ఏమిటి నాకీ నరకం అని దు:ఖిస్తుంటే జాలితలచి దివ్యతేజసంపన్నులైన ముగ్గురు మూర్తులు వచ్చి త్రినాధ వ్రతం చేస్తే దరిద్రం తొలగిపోతుందని చెప్పి వెళ్ళిపొయారు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అలాగే చేస్తానని సంకల్పించి ఇంటికి బయలుదేరేసరికి దారిలో ఆవుదొరికింది. భార్య్హతోకలిసి వ్రతం చేశాడు. అష్ఠయిశ్వర్యాలూ వచ్చాయి. ఇది తెలుసుకొని ఆ రాజ్యంలో యితరులు కూడా చేసి శ్రీమంతులవుతున్నారు.
ఆ పట్టణం రాజుకు అందరూ అలా శ్రీ మంతులు కావడం ఇష్ఠం లేదు. అందుకని తన రాజ్యంలో యీవ్రతం ఛేస్తే శిక్షిస్తానని శాసనం