పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేశారు. రాత్రులు మారువేషంలో తిరిగి అవరైనా చేస్తున్నట్టు తెలిస్తే వారిని మరునాడు దండించేవాడు. ఒక రోజు అకస్మాత్తుగా రాజుగారి కోట అగ్నికాహుతైపోతోంది. భార్యాబిడ్డలు కూడా అందులో గతించారని వార్తవచ్చింది. అప్పుడు త్రిమూర్తుల ఆగ్రహంవల్ల యిలా జరిగిందని గ్రహించి యీవ్రతం తాను చేస్తానని మన:పూర్వకంగా నమస్కరించాడు. వెంటనే కోట మామూలుగా కనిపించసాగింది. భార్యాబిడ్డలు ఎదురొచ్చారు.

ఇది పురాణాల్లోనూ ఉన్నట్టులేదు. ఇది పూర్తిగా జానపదులు కల్పించుకున్న కధ. ధూపానికి గంజాయి ఖర్చూ, చూడవచ్చిన వారికి ప్రసాదంగా పంచడానికి కొబ్బరికోరు, పంచదార ఖర్చూ తప్ప మరే ఖర్చూ లేనిది. జానపదులు దీనిని కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈ వ్రతం మనకు ఉత్కళ దేశంనుండి దిగుమతయింది.

హ ను మ ద్ వ్ర తం

ఇది పురాణాంతరతమైనది. భవిష్యత్ పురాణంలో చెప్పబడింది. ఇష్టార్ధము లిచ్చే వ్రతం అని, గ్రహబాధలు, రోగములు, పలాయన మౌతాయని దుష్టగ్రహములు తొలిగిపోతాయని, సర్వకార్యసిద్ధియని యీవ్రతం చేస్తారు. ఇది మార్గశిర శుక్ల త్రయోదశినాడు జరిపిస్తారు. వీలుంటే పంపానదీ తీరాన్మ చేస్తారు. ఇతర చోట్లచేస్తే 'హేమకూటగిరి ప్రాంతజతాం ' వంటి పురాణ మంత్రాలచేత పంపానది పూజచేసి తరువాత హనుమద్ వ్రతానికుపక్రమిస్తారు.

చేతికి పదమూడు ముడులతోరం కట్టుకుని 'ఓం నమోభగవతే వాయునందనాయ ' అనే మంత్రం జపిస్తూ అక్షతలతో షోడశోపచార పూజచేసి 13 అప్పాలు (నేయి, గోధుమ పిండితొ చేసినవి) దక్షిణ తాంబూలాదులతో పురోహితునకు వాయినం యిస్తారు. ఇలా చేసినవారికి ఆంజనేయుడు సహకారిల్గా ఉంటాడట. మూల మంత్రంతో సాంగోపాంగంగా వ్రతం పూర్తిచేసి మూడు సార్లు గంధం అభిమంత్రించి చేతులకు పూసుకున్నా, లలాటాన ధరించినా జనవశీకరణ వస్తుందట.

ఈ వ్రతం కూడా నైమిశారణ్యంలో శౌనకాదిమునులకు సూతుడు చెప్పిందే. పాండవులు ద్వైతవనంలో ఉండగా వ్యాసుడు పరామర్శించ