గొంగలని తీసుకుపోయి జైల్లో పడేశారు. అక్కడ యింటిదగ్గర దొంగలు పడి సర్వం దోచేశారు. తల్లీ కూతుళ్ళు అన్న వస్త్రాలకు కూడా కరువై అడుక్కోవడం మొలెట్టేరు. ఒకనాడు కళావతి భిక్షాటన చేస్తూ ఒక బ్రాహ్మణ యింట యీ వ్రతం చేయడం చూసి తల్లికి చెప్పింది ' ఆమెకు వెంటనే గతం జ్ఞాపకం వచ్చి పశ్చాత్తపం పొంది ఆ వ్రతం చేస్తానని సంకల్పించి భర్తను, అల్లుణ్ణి క్షమించమని ప్రార్దించింది. అక్కడ చంద్రకేతు మహ్జారాజు కలలో సత్యనారాయణస్వామి కనబడి వీరుచోరులుకారనీ, తెల్లవారేసరికి విడిచిపెట్టమనె చెప్పేడు. ఆ రాజు విడిచిపట్టడమే గాక నిధిలిచ్చి మరీ సాగనంపేడు. వారు ఓడలో ఆధనరాసులు వేసుకు వస్తుంటే స్వామి వారిని పరీక్షింపదలచి ముసలి బ్రాహ్మణడుగా వచ్చి సత్యనారాయణవ్రతం చెయ్యబోతున్నానని ధనసాయం చెయ్యమని అడిగాడు. వైశ్యుడు తమ దగ్గర ధనంలేదు పొమ్మన్నాడు. బ్రాహ్మణుడు ఓడలోఉందిగదా అన్నాడు. వైశ్యుడు ఓడలోనివి తీగలు, ఆకులు అన్నాడు. అట్లేఅగుగాక అని బ్రాహ్మణుడు వెళ్ళిపోయాక చూసుకుంటే తీగలూ ఆకులే ఉన్నాయి. వెంటనే పరుగు పరుగునవెళ్ళి అతని పాదాలు పట్టుకుంటే అత్రని సత్యదేవుని వ్రతం గుర్తుచేశాడు. సాధువు చెంపలేసుకుని ఇంటికి వెళ్ళగానే వ్రతం చేస్తానని సంకల్పించాడు. తీగలూ, ఆకులూ రత్నరాసులుగా మారాయి. ఓడ రత్నపురానికి వచ్చింది. ఆసమయంలో వైశ్యుని యింట కళావతి సత్యనారాయణ వ్రతం చేస్తోంది. భర్తా, అల్లుడూ వచ్చారని తెలియగానే లీలావతి కుమ్మార్తెను వ్రతం పూర్తిచేసుకురమ్మని తాను ఏటిఒడ్డుకు ఎదురెళ్ళింది. కుమార్తె కళావతి భర్త ఆగమనానికి ఆనందపడిపోతూ ప్రసాదం తినకుండా పరుగెత్తింది. అంతే - అక్కడ ఓడ నీటిలో మునిగిపోయింది. కళావతి భర్తకూడా అందులో మునిగిపోయేడు. కళావతి దు:ఖంతో భర్తను అనుసరించబోగా ఆకాశవ్బాణి వ్రతప్రసాదం భుజించకుండా వచ్చిన ఆమె తప్పిదానికి యీ ప్రమాదం జరిగిందని చెప్పగా ఆమె వెనుకకు వెళ్ళి ప్రసాదం తిని తీసుకొచ్చింది. ఓడ, భర్త తేలి పైకొచ్చేరు.
ఒకసారి అంగధ్వజుడనేరాజు అడవిలో మృగముల వేటాడుతూ ఒక చోటికి వెళ్లేసరికి, అక్కడ కొందరు గొల్లలు సత్యనారాయణస్వామివారి వ్రతం చేస్తున్నారట. వారి ప్రసాదం యివ్వబోగా రాజు తూష్ఠీభాగంతో తిరస్కరించాడు. వెంటనే తన వందలమంది కొడుకులూ