పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యీప్రసాదం తినమన్నారు. సాహిత్య సభలకి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఆహ్వనం అక్కరలేదంటాదు.

ఇది మాఘమాసంలోగాని, వైశాఖ మాసంలోగాని, కారీకమాస్ంలోగాఇ పుణ్యదినాలో చేస్తారు. ముఖ్యంగా ఏకాదశి, పౌర్ణమి దినాలలో ఎక్కువ. ఈ వ్రత్ం స్కాందపురాణంలో చెప్పబడింది. ఈ పురాణ కధలు చాలవరకు నైమిశారణ్యంలో శౌనకాది ఋషులకు సూతమహాముని చెప్పినట్లు ప్రారంభమౌతాయి. నారదుడు భూలోకంలో మానవుల కష్టాలు చూసి జాలిపడి విష్ణువు దగ్గరకెళ్ళి దీనికి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడట. దానికి విష్ణుమూర్తి సత్యనారాయణ వ్రతం చెప్పాడట. దీన్ని పరీక్షిజ్ంచడానికి నారదుడు భూలోకానికి వచ్చి భిక్ష మెత్తుకునే ఒక పేద బ్రాహ్మడునికి యీవ్రతం తెలిపాడట. వెంటనే అతను వ్రతం చెయ్యడానికి సంకల్పించు కున్నాడు. ఆనాడు ఎక్కువ బియ్యం దొరికాయట. దానితో వ్రతం చేస్తుంటే ఒక కట్టెలమ్ముకునే వాడొచ్చి అంతా చూసి ఆ ప్రసాదం తిన్నాడట. ఆ రోజు అతనికి రోజూ కంటే మూడించలు ఎక్కువ అమ్ముడుపోయాయి.

ఉల్కాముఖుడనే రాజు, భద్రశీల అనే భార్యతో ఏటివొడ్డున యీవ్రతం చేస్తుండగా సాధువు పేరుగల వైశ్యుడు చూసి యీవ్రతం ఎందుకు చేస్తున్నారని అడిగితే సంతానంకోసం అన్నాడాట/ ఆవోశ్యునికి కూడా సంతానం లేదు. ప్రసాదం తీసుకొని తిని తనకు సంతానం కలిగితే వ్రతం చేస్తానని సంకల్పించాడట. అంటే - భార్య లీలావతి గర్భం దరించింది. అందాల భరిణ అమ్మాయిపుట్టింది. కళావతి అని పేరు పెట్టాడ్రు. అయితే తీరికలేని పనుల్తో వ్రతాన్ని వాయిదా వేసుకున్నాడు ఆమెపెళ్ళయ్యాక చేద్దామని, ఆమెకు రత్నాకరుడనే వైశ్య శ్రేష్ఠునితో వివాహం జరిగింది. మామా అల్లుళ్ళిద్దరూ వ్యాపారం నిమిత్తం సింధునదీ తీరంలోని ర్త్నసానుపురం వెళ్ళేరు. అక్కడ వ్యాపారం జోరయ్యింది. ఆ ఆనందంలో సాధువు సంకల్పించినవ్రతంసంగతే మరిచిపోయేడు. స్వామికి కోపం వచ్చింది. ఒక రోజు రాత్రి దొంగలు అదేశపు రాజైన చంద్రకేతు మహారాజు గారింట్లో దొంగతన్ం చేసి భటులు తరుముకొస్తుంటే భయంతో ప్రక్కనున్న యీవైశ్యులున్న్ అరుగుమీద పడేసి పారిపోయేరు. రాజభటులు యీషావుకార్లను