పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సామాన్యుడికి సాధ్యంగాదు. అందువల్ల సూక్ష్మంలో మోక్షంగా యీ వ్రతాలు అవతరించాయి. వీనికి విశ్వాసం ప్రధానం. జానపదులు ఎంతో భక్తి విశ్వాసాలతో వీనిని ఆచరించి మనస్సును తేలిక పరుచుకుంటారు తమ భారం దేవుడిమీద పడేసి. నిజానికి యీదేవుడనే అదృశ్యశక్తే సృష్టింపబడకుంటే యీ కస్థాల కడలిలో మనిషి మనుగడ ఎంతబాధాకరం ! అందుకే దేవుడి కంటే దేవుణ్ణి సృష్టించిన వాణ్ణిమెచ్చుకోవాలి.

సహజంగా జానపదులు కులమత వర్గ వివక్షతలేకుండా అరాధించే దేవుడు తిరుపతి వేంకటేశ్వరుడు. ఆపద మొక్కులవాడు. కొండకొస్తానని, తలనీలాలిస్తానని మ్రొక్కుకుంటే చాలు ఆవనిజరిగి పోతుందనేది ప్రతీతి. 'తట్టుడి - తెరువబడును, పిలువుడి - పలుకబడును" అన్నంతతేలిక. అందుకే నిత్యం వేలాదిమంది అదేవుణ్ణి దర్శిస్తూ మొక్కులు చెల్లిస్తుంటారు. అట్లాంటి దేవుడే సత్యూనారాయణ స్వామి కూడా.

                              స్సత్యనారాయణ వ్రతం

తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు దగ్గర అన్నవరంలో పంపానదీ తీరాన రత్నగిరిపై వెలిశాశు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి. దరిద్రబాధలు తీరడానికి యీస్వామి వ్రతం దివ్యౌషధంగా భావిస్తారు. ఈ వ్రత సందర్భంలో బంధుమిత్రుల కట్నాలు, చదివింపులు చూస్తుంటే లౌకిక పరంగా కూడా యిది నిజమే అనిపిస్తుంది. (ఈ మధ్య అధికారులు, డక్టర్లు, లాయర్లు, అధిక సంపాదనకు ఇది సాధనంగా కూడావాడుకుంటునారనుకోండి). ఈ స్వామి సన్నిధిలో మొక్కుకున్న పెళ్ళిళ్ళెక్కువ. ఖర్చు తక్కువ. ఈ దేవున్మి వ్రతం సామాన్యుని పాలిట కల్పవృక్షం. సాగినవాళ్ళు కొండకెళ్ళీ చేసుకుంటారు. సాగలేనొఇవాళ్లు యింటి దగ్గరే చేసుకుంటారు. ఇందులో ప్రతిభాగానికీ ప్రత్యేక విశేషముంది. ప్రతఫలంలో ప్రేక్షకుడికి కూడా భాగస్యామ్యంవుంది. కధా ప్రారంభంనుంచి ప్రసాదం తీసుకొని భుజించేవరకూ. కధా ప్రారంభం అయ్యాక కధ్యలో లేచిపోతే కీడు జరుగుతుందట. ఆఖరున ప్రేసాదం భుజించకుండా పోయినా అపరాధం చేసినట్టే. కాబట్టి అడిగైనా