పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/484

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చంపవద్దని పరోక్షంగా చెప్పడమే యీ నాగపూజ (అయినా యిప్పుడు పుట్టలుత్రవ్వి అట్టుకు మరీ చంపేస్తునారనుకోండి వీని తోళ్ళకు విదేశాల్లో మంచి గిరాకీఉండటంవల్ల ధనాశతో).

      ఈ నాగులచవితినిగూర్చి శ్రీనాధుని "శివరాత్రి మహాత్మ్యం"లో యిలా స్పృజింపబడింది.

                         "చలి ప్రవేశించు నాగులచవితి నాడు" అని -

                            ఋ షి పం చ మి
          వినాయకచవితి మరుసటిరోజు పంచమి ఋషిపంచమి. పల్లెలలో స్త్రీలు ఈరోజు నోములుపడతారు.  నోములు తీర్చుకుంటారు.  పేరంటం, పారాణి యిందు ప్రత్యేకతలు.  బ్రాహ్మణ, వైశ్య కుటుంబాలలో సప్తఋషులను వ్రతములని చెప్పినవిధముగా పూజించ్వి ఉధ్యానపనమి చేస్తారు.  కొన్నినెలలముందుగనే యీ వ్రతము సంకల్పిస్తారు.  సప్తఋషులకు ఇష్టమైన ఫలపుష్పశాబములతో నైవేద్యం పెడతారు.
                 సు బ్బా రా యు డు ష ష్టి
        సుబ్రహ్మణ్యేశ్వరుని జానపదులు సుబ్బారాయుడు అని పిలుస్తారు.  ఇదికూడా నాగపూజే.  కాని యిది ఆలయంలో ప్రతిమను పూజించడం. సాధారణంగా ప్తరి మూడు నాలుగు గ్రామాలకూ ఈ గుడి ఉంటుంది.  ఈరోజు ఉదయం స్నానాలుచేసి ఆవూరిజనం, పొరుగూరి జనాలుకూడా వచ్చి గుడిబయట అమ్మే పూవులు, పగడలు (వెండివి) కొని, అరటిపళ్ళూ వానితోపాటు దక్షిణగా డబ్బులూ స్వామిపళ్ళెంలో వేసి నమస్కరించి ప్రసాదం తీసుకుని, ఏకభుక్తంతో ఉపవసిస్తారు.  ఆదేవాలయం ముందు అనేకవిధాలయిన పళ్ళదుకాణాలు, ముఖ్యంగా ఖర్జూరం దుకాణాలు హెచ్చుగా వుంటాయి.
     ఆ రాత్రి బోగంమేళం, బేండు, సన్నాయిమేళం, రాండోలుమేళం, వీరణాలు, కాగడాలు కళ్ళు మిరిమిట్లుగొలిపే బాణాసంచాకాల్పులతో దేవుని ఊరేగింపు వైభవంగా జరిపేవారు.  మలిరోజురాత్రి, మూడవ రోజురాత్రి గొల్లకలాపం, భామాకలాపం వంటి యక్షగాన ప్రదర్శనలు