పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/485

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉండేవి. ఈ షష్ఠిసంబరాలు ఆరోజుల్లో ఆరాధనాభావంతోచేసినా గొప్ప వేడుకగావుండేవి. అందుకే "సుబ్బారాయుడుపెళ్ళి చూసివద్దాం రండి" అనేది పిల్లలపాటల్లో పెద్దగా చోటుచేసుకుంది.

    ఈ షష్ఠి ఉత్సవాలకు బిక్కవోలు, మహేంద్రవాడ, పందలపాక, కొకుదురు, సంగం, రాగంపేట, దివిలిదగ్గర సుబ్బారాయుడుపేట, మల్లాందగ్గర సుబ్బారాయుడు పేటా, గొల్లప్రోలుదగ్గర తాడిపర్తి, చేబోలు దగ్గర మల్లవరం, గొల్లపాలెందగ్గర గొర్రిపూడి, ఈండ్రపాలెం గ్రామాలు ప్రసిద్ధి.
                          ర ధ స ప్త మి
     ఇది ప్రత్యేకించి స్త్రీలకు సంబందించినది.  మాఘంబహుళసప్తమి రోజున వస్తుంది.  ఇది సూర్యారాధనకుద్దేశింపబడిన కార్యక్రమం.  స్త్రీలు ఉదయమే నెత్తిమీద తెల్లజిల్లేడాకుపెట్టుకుని దానిపై రేగుపండుపెట్టి, దానిపై చెంబుతో నీళ్ళుపోసుకుంటూ శిరస్నాంచేసి ఏరుపిడకలతో ఆవుపేడ గోడను చరవకుండా, వేసినపేడకడి వేసినట్టేతీసి ఎండంబెడతారు.  (ఇదే ఏరుపిడక) దాలివేసి (దాలిఅంటే పిడకల్ని పొయ్యిలేకుండా బయట గుండ్రంగాపేర్చడం) దానికి అగ్నిముట్టించి, దానిమీద చెంబులో ఆవుపాలుపోసి పొంగిస్తారు.  పొంగు పొంగుకీ గుప్పెడు బియ్యం చొప్పున మూదుపొంగులలో వేసి "నీపాలు మేము పొంగిస్తున్నాం, మాసంసారం నువ్వు పొంగించు తండ్రీ" అంటూ పరమాన్నం వండుతారు.  చిక్కుడుకాయలు చీపురుపుల్లలతొ రధాలుగా గ్రుచ్చి, దానిపై తమలపాకు పరచి, దానిమీద ఆ పాయసంపోసి సూర్యభగవానునికి నైవేద్యంపెట్టి, రధాలు సూర్యాభిముఖంగా ఎండలో లాగుతారు.  (దేహంమీద ఎండ పడకుండా ఆరోగ్యరీత్యా అవసరంకదా!)
   అయినా ఆదిలో ప్రకృతిశక్తులన్నీ ఆరాధ్యదైవాలే! జిల్లేడు పత్తి ఒత్తి పాలలో అద్ది, తలమీద తెగినచోటపెట్టి రాస్తే ఒప్పి తగ్గుతుందట.  తల్లెజిల్లేడాకురసం చంటిబిడ్డలనొప్పులకు గొప్ప ఔషధం.  రేగుకాయ 'సి ' విటమిన్ నిండుగా కలగిన ఫలం.
    రధసప్తమినిగురించి శ్రీనాధుడు శివరాత్రి మహాత్మ్యంలో "మొఱయు వేసని రధసప్తమీ దినమున" అని వ్రాశాడు.