పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/483

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా గు ల చ వి తి

                జానపదులు విశేషప్రాముఖ్యమిచ్చే చవితి మరొకటుంది.  అదే నాగులచవితి. ఇది దీపావళివెళ్ళీన నాలుగవరోజువస్తుంది.  ఈరోజు ఆడా మగా బిడ్దలతోసహా అందరూ ఉదయమే స్నానంచేసి పాముపుట్టలున్న చోటికివెళ్ళి ఆ పుట్ట కలుగుల్లో పాలుపోసి, కోడిగుడ్లువేసి, బుర్రిగుంజు, తేగముక్కలు, చలిమిడి, చిమ్మిలి నైవేద్యంపెట్టి పసుపు, కుంకుం, అక్షతలతో పూజిస్తారు.

                              'దిగుదిగు నాగన్న దివ్య సుందరి నాగ
                              నాగా దిగురా నాయన్నా దిగరా శేషా దిగరా"
                      అంటూ పాటలతో మంగళ హారతులిస్తారు.

     * "నాగరాజునుపూజించి వనితలిట్లు మ్రొక్కుతారు.  నాగేంద్రుడా! ఫణీంద్రుడా! మావాళ్ళు చీకట వాకట తిరుగుతారు.  నడుమ త్రొక్కితే నావాళ్ళనుకో. పడగత్రొక్కితే పారిపో" అని, ముఖ్యంగా రైతొలూ, కూలీలూ రాత్రింబవళ్ళు పొలాల్లో తిరుగుతుంటారుగదా! ఇలా పూజచేస్తే అవి కనికరించి కరవవని నమ్మకం. నాగేంద్రుడు దేవుడుగా మనకు ఎన్నో జానపదకధలున్నాయి

ఈ భూభారాన్ని మోస్తున్నది ఆదిశేషుడనీ, మహావిష్ణువు పాన్పు నాగరాజేఅని పురాణాలు చెబుతున్నాయి. చరిత్రరీత్యాచూస్తే ఆదినుండీ మానవుడు నాగుపామున్ దేవతగా ఆరాధించినట్లు ఆనాటి శిలలపై చెక్కిన శిల్పాలద్వారా తెలుస్తోంది.

    కొందరు గొడ్రాళ్ళు పిల్లలకోసం ఈరోజున నాగులకోకలని ఒకరకం చీరలుధరిస్తారు.  కొందరు నూరుంబించెలనీళ్ళతొ అభిషేకిస్తారు పుట్టని. (పాముగాని పైకొచ్చిందా అంటేసంగరులనుకోండి). కొందరు నాగరాజు మీది భక్తికొద్దీ పిల్లలకు నాగులునాగమయ్య, నాగయ్య, నాగమ్మ, నారాజు, నాగన్న అని పేర్లుపెట్టుకుంటారు. చెముడున్నవాళ్ళు మొక్కుకుని యీ పూజచేస్తే చెముడు పోతుందట.
    ఇంతకీ విఅధ్యరీత్యా సర్పగరళం చాలా విలువయినది. ఒక్కోసారి పోయే ప్రాణాన్నికూడా నిలబెడుతుంది.  అందువల్ల నాగుబాముల్ని

  • ఆంధ్రులచరిత్ర - సంస్కృతి. పు.59 ఆచార్య ఖండవల్లి లక్ష్మీ నిరంజనంగారు