పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/481

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కోమటోరక్కమ్మ యీవ్రతం పట్టేరట. రాచనారక్కమ్మ సుకుమారి కావడంతో ఆకలికి తాళలేక గిలగిల్లాడిపోతుంటే అన్నలు అద్ధంద్వారా చంద్రుణ్ణిచూసినట్లు భ్రమింపజేస్తే ఆమె భోజనం చేసేసింది అసలు చంద్రుడు పొడవకముందే. ఆమెకు ముసలిమొగుడొచ్చాడాట. చంద్రునివంటి అందగారు మొగుడు కావాలని కాంక్షతోచేసే వ్రతమిది.

         అట్లతద్దినాడు నూతనవదువుచేత ముత్తయుదువలకు వాయినాలిప్పి స్తారు.  పదకోండు అట్లు, పసుపు, కుంకుమ, తాంబూలం, రవికలగుడ్డ చీర చెంగులోపెట్టి యిస్తుంటే ముత్తయిదువ తనచీరచెంగుపట్టి అందుకుంటుంది.  ఈమె 'ఇచ్చేనమ్మా వాయనం ' అంటే, ఆమె 'పుచ్చుకున్నానమ్మా వాయనం ' అంటుంది.
  ఉండ్రాళ్ళతద్దినాడు ఉండ్రాళ్ళూ, అట్లతద్దినాడు అట్లూ వండి గౌరీదేవికి నైవేద్యం పెడతారు.  ముంజేతికి మామిడాకుతోరణంకట్టుకుని (కంకణం) తమలపాకుమీద ప్సుపుముద్దతో గౌరీదేవినిచేసి (సన్నికల్లు లాగ) పత్రి, పూలుతెచ్చి వధువుచేత పూజచేయించి, "ఇదుగుపచ్చన పొరుగుపచ్చన, మాయిల్లుపచ్చన" అని ప్రార్ధన చేయిస్తారు (పండితులు "సర్వేజనా: సుఖినోభవంతు" అనేదాని భావమే యిది) సాయంత్రం ఆపత్రీ పూలూ, పసుపూ వగైరాలను ఎత్తివేసి 'పాలల్లో గౌరమ్మా నీలల్లోగౌరమ్మా ' అంటూ దగ్గరలోనున్న నూతిలోగాని, చెరువులోగానీ కాలువలోగాని కలిపేస్తారు.
       ఈ తద్దెలకు చెట్లకు ఉయ్యాలలువేసి ఎంతోఉత్సాహంగాఊగుతారు పెద్ధవాళ్ళుకూడా వయస్సుభేదం మరచి.
                        వి నా య క చ వి తి

                           "ఓబొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య
                           ఉండ్రాళ్ళమీదకు దండు పంపు"

    భాద్రపదశుద్ధ చవితి వినాయకచవితి.  ఈనాడు తెలుగుపల్లెలలో ప్రతి యింటా ఆడామగా పిల్లా పాపా అందరూ ఉదయమే తలారాస్నారం చేసి నేరేడు, మారేడు, ఉత్తరేణి, జమ్మి, అశ్వద్ధ వగైరా రకరకాల