పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/480

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూజితారావమానాలూ, తమనక్షత్రానికి చెప్పబడ్డ సున్నలూను. ఈ సున్నాల్ని బట్టేవారి ఆరోగ్యస్థిగతుల మదింపు జరుగుతుంది. దీనినే "కందాయ ఫలమ్" అంటారు. ప్రతితారకూ వానిస్థితినిబట్టి సున్ననుండి ఏడుసంఖ్యలవరకూగల అంకెలలో ఎవో మూడు అంకెలు వరుసగా వ్రాయబడతాయి ఫలితాలు ఈ సున్నల స్థానానిబట్టి చెబుతారు.

                            "ఆదిశూన్యే మహావాధి,
                             మధ్యశూన్యే మనోవ్యధా
                             అంత్యశూన్యే ఫలం స్వల్పం
                             త్రిశూన్యే నిష్పలం భవేత్"
                అవన్నీ తెలుసుకుని పురోహితునికి సంభావనలిచ్చి సత్కరిస్తారు.

                               య మ ద్వి తీ య
      ఇక విదియదగ్గరకొస్తే కార్తీకశుద్ధవిదియను యమద్వితీయ అంటారు.  ఈరోజుబ్రాహ్మణ కుటుంబాలలో కొందరుభక్తితో యమునిపూజించి భగెనీహస్తభోజనం చేస్తారు (సోదరి చేత్ భోజనం) దీర్ఘాయువుకోసం. ఈరోజు శ్రీకృష్ణుడు సుభద్ర చేతిభోజనం చేశాడట.
                                  అ ట్ల త ద్ది
       తదియకు ప్రాముఖ్యం సంవత్సరంలో రెండుసార్లు వస్తుంది.  మొదటిదై ఉండ్రాళ్ళతద్ది. భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్ళతద్ది. రెండవది అట్లతద్ది. ఆశ్వయుజ బహుల తదియ అట్లతద్ది.  ఇందులో అట్లతద్దిది అగ్రస్థానం.  ఈ రోజున వేకువఝామునే పిల్లలులేచి జట్టులు జట్టులుగాకూడి "అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్" అంటూ అరుస్తూ వీధులంట తిరుగుతూ ఊరందర్నీ మేలుకొలుపుతారు.  ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించినది.  ఈ తద్దెలౌపవాసం బలేతమాషాగాఉంటుంది.  స్త్రీలు కోడికూతతోలేచి వంటలుచేసికొని తెల్లవారకుండా భోజనంచేసేస్తారు.  మళ్ళీ రాత్రి చంద్రునిచూసినతరువాతే భోజనం. అంటే పగలంతా పచ్చిమంచినీళ్ళుకూడా ముట్టరన్నమాట, ఏమీతినరు. తింటే ముసలిమొగుడొస్తాడట.  దీనికొక కధకూడా చెబుతారు ముసలమ్మలు. ఒకప్పుడు బాపరారక్కమ్మ, రాచనారక్కమ్మ,