పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/482

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పత్రి, కలువ, చెంగల్వ, తామర, మందార, జాజి, గన్నేర్ మొదలగు నానావిధపరిమళ పుష్పములు పూజకైతెస్తారు. వినాయకుడి మట్టిబొమ్మచేసి, పీటమీద క్రొత్తగుడ్డపరిచి, దానిపైబియ్యంపోసి, దానిపై వినాయకునిబొమ్మపెట్టి, పైన ఒక నలుచదరంగా పాలవెల్లికట్టి వ్రేలాడదీసి దానికి మామిడాకులుమడిచి తొడిగి కలువపూలూ, తామపూవులూ, మొక్కజొన్న పొత్తులూ, వెలక్కాయలూ, బత్తాయికాయలూ, మారేడుకాయలూ, జామికాయలూ వ్రేలాడదీస్తారు. కుడుములూ, ఉండ్రాళ్ళూ, జిల్లేడుకాయలూ వండి నైవేడ్యంపెడతారు. ఊరిపురోహితుడువచ్చి గణపతిపూజచేయించి చవితిచంద్రునికధ చెబుతాడు. ఆరోజు చంద్రుని చూడరాదట. చూసినందువల్ల శ్రీకృష్ఠుడంతటివాడుకూడా ఎలా నీలాపనిందల పాలయ్యెడో చెప్పి (శమంతకమణి కధ) ఉపసంహారంలో అవరయితే నేడు గణపతిని పూజించి కధవిని అక్షతలు నెత్తిమీదవేసుకుంటారో వారు చంద్రునిచూసినా నీలాపనిందలు రావని ఫలశ్రుతి చెబుతారు.

       విధ్యార్ధులు గణపతి పీఠంమీద తమ పుస్తకాలుంచి పూజిస్తారు విద్య, విజ్ఞానాలనిమ్మని కోరుకుంటూ, అలాగే అందరూ తమతమ వృత్తులకు వాడే పరికరాల్నికూడా పూజిస్తారు.  ముఖ్యంగా రైతులు తమ గాదుల్లో వినాయకప్రతిమను పెట్టి పూజిస్తారు ధాన్యవృద్ధికోసం.
    గ్రామాల్లో ఉత్సాహవంతులు విరాళాలు ప్రోగుచేసి ఒకచోట పందిరివేసి గణపతిని నిలిపి తొమ్మిదిరోజులు పూజలు సలుపుతూ ఉత్సవాలు చేస్తారు.  ఆరోజుల్లో ప్రతిరోజూ ఒకనాటకమో, నృత్యమో, పురాణమో, హరికధో బుర్రకధో ఏదోఒకటి పెట్టేవారు.  అలాగ వేలాదికళాకాలకు భిక్షపెట్టేవాడు వినాయకుడు.(ఇప్పుడు 16 ఎం.ఎం. సినిమాలు వీనిస్థానంలో కొచ్చి కళాకారుల కడుపుకొట్టినా యనుకోండి). ఆఖరిరోజున మేళతాళాలతో గణపతిని ఊరంతా ఊరేగించి దగ్గరగల నదిలొనో, కాలువలోనో నిమజ్జనంచేసి ఆ మరుసటిరోజు పేదసాదలకు అన్నదానం చేసేవారు.
    ఈ పూజకువాడే ఆకులకూ, ఫలములకూ వైధ్యరీత్యా మంచి ప్రాముఖ్య ముంది.  మారేడుఫలము రసం (మాదీఫలరసాయనం) పైత్యహారి, నేరేడుఆకులు ఎండబెట్టి కాల్చిబూడిద కాలినబొబ్బలమీదరాస్తే యిట్టే మాడి పోతాయి.  ఉత్తరేణిపుల్లతో పండ్లు తోముకుంటే దంతవ్యాధులు రావు.