పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/479

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పర్వదినవేడుకలు

  ఆదినుండీ జానపదులు తిధివారనక్షతాల పడికట్టుతోనే ముఖ్య కార్యక్రమాలకు పక్రమించడం కద్దు.  అందులోనూ తిధికి ప్రాముఖ్యం మరీ ఎక్కువ.  జానపదులు తిధులకు కొన్ని విధులను నిబంధించి ఒక్కోతిధికి సంవత్సరంలో ఒకటి రెండు రోజులలో ప్రత్యేకత సృష్టించి విశిష్ఠ నామాలతో వానిని సుప్రతిష్టితం గావించి పందుగలుగానూ, పర్వదినాలుగానూ రూపొందించుకున్నారు.  వీని తేదీలు పంచాంగంలో తెలుగునెలల నడకల్నిబట్టి, గ్రహాల గమనాన్నిబట్టీ స్థిరీకరించబడతాయి.
                           ఉ గా ది
        పల్లెలలో దీనివాడుకపేరు సంవత్సరాది.  చైత్రశుద్ధ పాడ్యమి రోజిది. వేపపువ్వు పచ్చడి దీని ప్రత్యేకత. ఉదయం అందరూ తలంటుకొని, క్రొత్తబట్టలుకట్తుకొని పరగడుపున వేపపువ్వుపచ్చడి తెంటేగాని ఏమీతినరు.  వేపపువ్వు, కొత్తబెల్లం, చింతపండు, అరటిపండు, శనగపప్పు, కొబ్బరిముక్కలు, పచ్చిమామిడికాయముక్కలు ఈ పచ్చడిలో కలిపే పదార్ధాలు.  ఇది తియ్యగా, పుల్లపుల్లగా, వగరువగరుగా బలేరుచిగా వుంటుంది. (చెయ్యడం చేతకాకపోతే చేదుగాకూడా ఉంటుందనికోండి.)
       ఈ వేపపువ్వుపచ్చడి కడుపులోని నులిపురుగుల్ని చంపుతుంది.  (అంటే యిందులో ఒక అరోగ్యసూత్రం యిమిడిఉందన్నమాట). ఈ రోజు ఎలాగడిపితే సంవత్సరమంతా అలాగే నదుస్తుందని జానపదుల నమ్మకం.
   మధ్యాహ్నం గ్రామచాచిడివద్దగాని, దేవుడిగుడిలోగాని పురోహితుని పంచాంగ పఠనం ఉంటుంది.  ఆ సంవత్సరమంతటిలో గ్రహాది క్యములూ, తత్పలితాలూ, అభివృద్ధి, అనావృష్టి, పంటలదిగుబడి, దేశకాలపరిస్థితులు వగైరా పంచాంగంలో వ్రాయబడ్డవి చదివి వివరిస్తాడు.  తారాబలం చదువుతుంటే తత్సంబంధిత నక్షత్రాలవారు ఆ సంవత్సరంలో తమజీవితౌ హెచ్చుతగ్గుల్ని అంచనావేసుకుంటారు. అందరూ అడిగితెలుసుకునేవి ముఖ్యంగా మూడు.  ఆదాయవ్యయాలూ, రాజ