పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/478

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇప్పటికి 500 ఏండ్ల క్రిందట మానసోల్లాసా కావ్యంలో దీనిని ఒక ప్రకరణంగా వర్ణించారు. దండి క్రీ. శ. కవుల ప్రాంతంవాడు. తన దశకుమార చరిత్రములో కోడి పందెం వర్ణించాడు. అందువారిదేశ జాతి ఒకజాతికోడిని గెలిచనని వ్రాసేరు. అభీనవదండియగు కేతన తెలుగులో దశకుమారచరిత్రేము వ్రాసినప్పుడు కోడిపందేలను చాలా విస్తరించి వ్రాసేడు - మచ్చుకి యీ క్రింది పద్యం చూడండి.

                      "ఎదిరిన కోడి ముచ్ననసి యానెడు మెడ
                      వెసగాడ మరవడి వ్రేసి వ్రేసి
                      గెలిచెనాయాట దగవారి కేళజాతి"

                          పొ ట్టే లు పం దే లు
      గొ`ఱ్ఱెపొట్టేళ్ళకి కోడిపుంజుల్లాగే పౌరుషంఎక్కువ. అవి ఢీకొనడం మొదలుపెడితే తలనుంచిరక్తం ఏరులైపారినా లెక్కచేయవు.  ఈ ఢీకొనటంలో ముందుగా తర్ఫీదుయిస్తారు.  మొదట గొఱ్ఱెతలకుదగ్గరగా అరచేయిపెట్టితాకిస్తూ వెనక్కినెట్టుతూ క్రమంగా దూరంగానిలిచి "డుర్ చివ్" అని అరచేయి చూపిస్తారు.  అది పరుగుపరుగునవచ్చి అరచేయిని ఢీకొంటుంది.  ఆ తరువాత చేయికిబదులుగా చెక్కనుపెట్టి గట్టిదెబ్బక్ అలవాటు చేస్తారు.  వానిని బలంగా మేపి పండుగల్లో పందానికి ఉసిగొలిపి వదులుతారు.  అవి రెండూ ఇరువైపులా దూరంగావెళ్ళి పరుగున వచ్చి ఒకదానితలనొకటి ఢీకోంటూ వీరోచితంగా పోరాడు తాయి. పొట్టేలు పందెంఅంటే చూడ్డానికి చుట్టుప్రక్కల పదిపన్నెండుగ్రామాల ప్రజలు తీర్ధంలావచ్చి చూసి వినోదించేవారు.
                            ఎ డ్ల పం దే లు
               ఇది బలప్రదర్శనకు సంబంధించినది.  బండి చక్రాలు తిరగకుండా వానిని తొట్టికికట్టేసి ఎడ్లుకట్టి లాగిస్తారు.  ఏ బండి ముందుగమ్యంచేరితే ఆ ఎడ్ల జత నెగ్గినట్టు.  ఈ అని కొన్ని చొట్ల ఇసుకలో చేయిస్తారు.  కొన్ని చోట్ల బండిలో బరువుబస్తాలుకూడా వేస్తారు.  ఈ పండగ నాలుగురోజులూ జానపదులకు ప్రతిరోజూ వేడుకే.  జానపదులు తాము యితరులకు ధర్మంచేయడంలో గొప్ప ఆనందం పొందుతారు - అది వారికి మనస్సునిండిన వేడుక.