పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/459

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉం గ రా లు దే వ డం

వధువురూరూపంలో నింపుకొని పదిలపరచుకొడని పరోక్షంగా చెప్పడం ఇట్లాంటి ఆనందకరమైన కార్యక్రమమే ఆవిరేడుకడవలో ఉంగరాలు దేవడం. ఈ కడవనే 'గరికంముంత ' అంటారు కొన్నిచోట్ల, కడవలో నీళ్ళు పోసి పురోతుడు బంగారు ఉంగరఆలు, కాలిన్మమట్లు అందులో వేస్తారు. వధూవరులు ఆ కడవలోచేతులు పెట్టి అవిదేవి తియ్యాలి. అవి ఎవరైతే ముందుచిక్కించుకునితీస్తారో వారు గెలిచినట్టు. ఈ దేవడంలో కుండలో యిరువురిచేతులూ స్వేచ్చగా కలుస్తాయేమో, పైగా అది అవరికీకనుపించనిచోటేమో అప్పటివరకూ బిగబట్టుకొని వున్న ఉత్సాహం కట్టలు తెగి, పారి కొంటెగాచిటికెనవ్రేలుగిల్లుకోవడాలు (ఒకరిచేతిలోనివి ఏ ఒకరు కాజేయడానికి) బలే ఆహ్లాదంగా ఉంటాయి. అనంతరం పెండ్లికూతురూ, ఆమె ఆడబడుచులకూకూడా యీ ఉంగరాలుదేవడం పెడతారు. ఈ ఉంఘరాళ్ వెదికేటప్పుడు వదినామరదళ్ళు ఆత్మీయమైన సంవాదాలూ, సరసోక్తులూ, మధురోక్తులూ వదువుతో అత్తవారి క్రొత్తదనం హరింప ఝెశీ వారిలో ఒకరుగా కలిచిపోయే ప్రేకరంగా ఉపకరిస్తుంది.

                          పా దం త్రొ క్కిం చ డం
      నూతనవదూవరుల్ని చేహరీత్యామరింత సన్నిహితం చేసే దైహికమైన వేడుక యిది. ఒకరిపాదం మరొకరిచేత  త్రొక్కిస్తారు సానమీద పెట్టించి.  ఇది తొలిస్పర్శేమో ఒక్కసారిగా ఒళ్ళు గగుర్ఫొడిచి మనసుల్ని ఆనందడోలికల్లో ఓలలాడిస్తుంది.  ఇక్కడ అటువారూ, ఇటువారూ ఆమె త్రొక్కేస్తోందనీ, అతని గట్టిగా త్రొక్కేస్తున్నాడనీ ఫిర్యాదులు చేసుకుంటూ ఏకసక్కాలాడుకుంటూ ఆఘట్టాన్ని కూడా వినోదభరితం చేస్తారు.


                                   అరుంధతీ నక్షత్రం
     వివాహాలలో సీతారామ్లకు ఎంత ప్రాముఖ్యముందో వశిష్ఠుని భార్య అరుంధతికి అంతకంటె ఎక్కువ ప్రాముఖ్యముంది.  పెళ్ళిళ్ళలో ఆమెదే పెద్దపీట. కారణం - ఎప్పుడూ పతి ఎడబాటుఎరుగని పతివ్రత ఆమె.  అందుకే పెద్ద ముత్తయిదువామె.  రాత్రులు ఆకాశంలోకిచూస్తే