పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/458

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

             “అగ్నిసాక్షిగగొన్న అంబుజాక్షినిగాని
             కలనైన పరకాంత దలచి యెరుగ“

                  తలంబ్రాలు
   అనంతరంజరిగే తలంబ్రాలకార్యక్రమంఅందరినీ అలరించే వినోదాత్మకమైనవేడుక. పురోహితుడు ఇరువురిచేతుల్లోనూ కొబ్బరికురిడీ చిప్పలుపెట్టివానిలో పళ్ళెంలోని బియ్యంపోసి వధూవరులచేత ఒకరినెత్తిమీద మరొకరితో అటూఇటూ మూడుసార్లు పోయుస్తారు. తరువాత ఆపళ్ళెంలోని బియ్యం వధూవరులిరువురూ దోసిళ్ళలో ఒకరినెత్తిమీద ఒకరూత్సాహంగా పోసుకుంటుంటే చూసేఅందరివదనాలు ధరహాసంతో వికసించవలసిందే. పెళ్ళితంతులన్నిటిలోయిదే గొప్పసందడి. ఇక్కడ సీతారాములపెళ్ళి తల్ంబ్రాలవిషయమై చదవబడేశ్లోకం గమనార్హం

“జానక్యా:కమలామలాంజలి పుటేయా పద్మరాగాయితా:
 వ్యస్తారాఘనమస్తకేచవిలపత్కుంగ ప్రసూనాయితా:
 ప్రస్తాశ్యామల కస్యకాన్తి కలితా : యాయింద్ర నీలాయితా :
 ముక్తాస్తాశ్శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా:”

 అంటే - సీతారాముల కళ్యాణానికి మంచిముత్యాలు తలంబ్రాలు ఆనందోహాలతో ఒకరినెత్తిమీదఒకరు పోసుకుంటుంటే అవి సీతమ్మ దోసిల్లోఎర్రగాఉన్నాయట. రామునితలమీదపడగానే నల్లగామారుతున్నాయట. అవిరామునిశరీరంమీదికిజారగానే నీలిరంగులోకి మారుతున్నాయట. ఇది విచిత్రంగాలేదూ! కాని అలా మారడానికికారణం సీతమ్నవారిచేతులు ఎరుపుగనుక ఆముత్యాలు ఆమెచేతిలో ఎర్రగాఉన్నాయి.రామునిజుట్టు నలుపుగనుక తలమీదపడగానే నల్లగా కనిపించాయి. రాముడు నీలమేఘశరీరుడు గనుక అతనిదేహంమీద పడగానే నీలంరంగులో కనిపిస్తున్నాయి. ఆపుణ్యమార్తుల తలంబ్రాలు మీకు శుభము కలుగజేగాక అనే ఆశీస్సుబాహ్యార్ధం. అంతరార్ధమేమిటంటే మనస్సు మంచిముత్యం లాంటిదనీ, దానిలోనికి ఏభావంచొప్పిస్తే అదేప్రతిఫలిస్తుందనీ, అందువల్ల వధువుమనస్సు వరునిరూపంతోను, వరునిమనస్సు