పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/460

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సప్తర్షిమండలంలో వశిష్ఠునిప్రక్క కంపిస్తుంటుందీనక్షత్రం మిణుకు మిణుకు మంటూ, పార్వతి పరిణయ సమయంలో శివుడుకూడా తనతరుపున సంధానకరెతలుగా సప్త ఋషులతోపాటు స్త్రీలలో యీమె ఒక్కతినే పంపించాడు పెద్ద పేరంటాలుగా, పతి ఎడమెర్గని ఆధర్శదాంపత్యానికి యీమె వేగుచుక్క. అందుకే విహానంతరం పురోహితుడు వధూవరులను వాకిట్లోకి తీసుకొచ్చి ఆకాశంకేసిచూపిస్తూ అదుగో అరుంధతీనక్షత్రం అంటాడు. (పట్టపగళు కూడా అలాగే చేస్తాడనుకోండి) దీనిమీదమంచి జోక్ కూడా వుంది. పూర్వం ఒక వరుణ్ణి అరుంధతె3ఎ నక్షత్రం అదిగో కనిపిస్తోందా అంటే అరుంధతీనక్షత్రంకాదుగానీ ఆరువేలు అప్పుమాత్రం కనిపిస్తుందన్నాడట. బహుశా అవి కన్యాశుల్కంరోజులై ఉంటాయి. పిల్లనుకొనుక్కోవడంలో అప్పులపాలైపోయుంటాడు. ఇప్పుడైతే ఆమాట పెళ్ళికూతురు తండ్రులంటారు కట్నాలతోనూ ఖర్చులతోనూ నడుంవిరిగి ఫోయి.

                               త లు పు ద గ్గ పే ర్లు
     వివాహాల్లో మరోమంచివినోదం తలుపుదగ్గర పేర్లుచెప్పించడం.  గుమ్మం తలుపులువేసి, పెల్లికూతురుఆడబడుచులు లోపలుండి, వధూవ్రుల్ని "ఎవరెవరొచ్చారు?" అని ఆదుగుతారు.  ఇక్కడి పెళ్ళికొడు భార్యపేరుచెప్పి ఆమతో కలిసివచ్చానని చెప్పాలి.  అలాగే పెళ్ళికూతురుకూడా. సహజంగా సిగ్గుదొంతర్లలో పెండ్లికూతురు వరునిపేరుచెప్పడానికి వెనుకాడడం, ఎలాగో బలవంతంగా ఆమెచేత కనీసం మూడుసార్లయినా చెప్పించి తలుపుతీయడం బలే సరదాగా వుంటుంది అందరికీ. ఇదికూడా వధూవరుల్ని సన్నిహితం చేయడానికీ పెట్టిన వేడుకే.  ఇక్కడ తలుపులు వేసి అవలున్న ఆడబడుచులకీ, వధూరవులతోపాటు తలుపు యీవలున్నవధువుతరపువారికీజరిగే ద్సంవాదాన్ని తలుపుదగ్గరపాట అంటారు. అది--

                        "ముత్యాలావానాకురిసే ముగ్ధామీ వదినా తడిసే
                       తలుపూతియ్యండామ్మాల్లారా తగవూలెందుకూ
                      ముత్యాలవానకురియాలేదు ముగ్ధావదినా తడియాలేదు
                       తలుపుతియ్యము అన్నామేము తగవూలెందుకూ."