పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/455

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఊరేగింపు యిల్లుచేరగానె కూడావచ్చినవారందరికీ విందుబోజనాల ఏర్పాటుచేసేవారు. కొందరు ఊళ్ళోవారికి ముందుగానె భోజనాలు ఎట్టేసేవారు. (దానిపేరే ఊరపంక్తి). ఈ భోజనాలదగ్గర బావామరదల వరుసలవారూ, వదినా మరదళ్ళవసుసలవారూ ఒకరికొకరు కొసరి కొసరి వడ్డించుకుంటూ ఒకరిమీదఒకరు విసిరే చెణుకులు మంచి చమత్కారంగా వుండేవి.

                        కా శీ యా త్ర
    ఇక పెళ్ళితంతులదగ్గరకొస్తే పెళ్ళికిముందు (వడుగుదగ్గర) బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణాది కులాలలో విడిదిలోంఛి పెళ్ళికొడుకు పావుకోళు తొడుక్కుని, తాటియాకుగొడుగు చేతబట్టుకుని సన్యాసం పుచ్చుకుంటానని కాశీకి బయలుదేరేవాడు.  అతడు ఇలా వీధంట కొంతదూరంవెళ్ళగానే బావమరదలు వెళ్ళి తమసోదరినిచ్చి పెళ్ళిచేస్తామని వెళ్ళవద్దని గెడ్డం క్రింద బెల్లంముక్కపెట్టి బ్రతిమాలి వెనక్కి తీసుకొచ్చేవారు.  ఇదంతా చూస్తుంటే తెలియనివారికి గొప్ప త్రిల్ గా ఉండేది.  నాటకంగానడిచే చిత్రమైన వేడుక యిది.
                 కా ళ్ళ గో ళ్ళు తి య్య డం
        పెళ్ళికి ఒకగంటముందు వధూరవరులకు కాళ్ళగోళ్ళుతియ్యడం అనే కార్యక్రమం పెట్టేవారు.  పెళ్ళిలో వధూవరులచేత ఒకరిపాదాలుఒకరిచేత త్రొక్కిస్తారుకదా! అప్పుడు కాళ్ళగోళ్ళుగానీవుంటే ఒకరికొకరివిగ్రుచ్చుకొని క్రొత్తతగువులొచ్చే ప్రమాదముంది.  ముందుజాగ్రత్తగా(అలాగని చెప్పకుండా) గోళ్ళుతియ్యడమనేదాన్నికూడా ఒకవేదుకగాచేసి డబ్బులు దిగదుడిచి మంగలిపళ్ళెంలోవేసి మంగళస్నానాలు చేయిస్తారు.
                     పెం డ్లి తం తు
    అనంతరం పెండ్లిపీటలమీద కూర్చోబెట్టి ఒకరికొకరు కనిపించకుండా యిద్దనిమధ్యా తెరాడ్డంగా పెట్టేవారు.  ఈ తెర వధూరవులలోఒకరికొకరు చూసుకోలనే ఉత్సుకతను రేకెత్తించి అనురాగ అంకురాన్ని ఇనుమడింపజేస్తుంది.  పురోహితుడు వేదమంత్రాలతో పుణ్యాహవాచనం, వివాహ