పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/456

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీక్ష్యాకంకణం, యజ్ఞోపవీతదారణం, మధుపర్కదారణం, కన్యాదానం ఒకక్రమంలో జరిపిస్తూ మధ్యమధ్య భజంత్ర్ర్రీలను వాయించమటుంటాడు. ఈ బాజాలు ఎప్పుడెప్పుడు వాయించమంటాడయ్యాఅంటే ఒకాయన చెప్పేడు పురోహితుడు మంత్రాలుమరచిపోయినప్పుడల్లా అని. (అది నిజం కాకపోవచ్చులెండి)

                      క న్యా దా నం
        అత్తమామలు అల్లునికాళ్ళుకడిగి తమకూరుర్ని కన్యాదానం చెయ్యడంలో అల్లుడు దానగ్రహీత అయ్యాడు.  అత్తమామలు దాతలస్థాయికి ఎదిగారు.  అంటే అల్లునికివారు ఆరాధ్యులని చెప్పకచెప్పడం దీనిలోనిభావం.  అంతేగాని అల్లునికాళ్లు కడగడంతో అత్తమామలస్థాయి అడుగూ పడిపోయిందనేభావం సరికారు.  ఇచ్చేవారు గొప్పా? పుచ్చుకునేవారుగొప్పా? నిజానికి అత్తమామల ఔన్నత్యాన్ని అల్లునిహృదయం లో బలంగా ప్రతిష్ఠాపించే విశిష్ఠఘట్టం యీ దానవిశేషం.
                            సు మూ హూ ర్తం
 పురోహితుడు జీలకర్ర, బెల్లం వధూవరులచేత ఒకరినెత్తిమీద ఒకరిచేత పెట్టించి-

                  "దృవంతే రాజా వరుణం
                    ఢృవందేవో బృహస్పతి:
                    ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ
                    రాష్రంధారయాతా ధృవమ్"

   అని మంత్రాలుచదివే సమయమే సుమూహూర్తం.  ఇప్పుడుకూడా బాజాలు వాయిపచేస్తాడు. (ఇది మాత్రం మంత్రం మరిచిపోయికాదు, అవరైనాతుమ్మితే వినపడకుండేటందుకు మాత్రమే) ఇదే లగ్నం ఇప్పుడు అడ్డుతెర తోలగిస్తారు.  వధూవరులు ఇంతసేపూ ఉత్కంఠతతో ఎదురుచూస్తూ మరులుగొన్న మనసులతో ఒకరికొకదుతొలిసారిచూసుకున్న మధురక్షణం అది.  పూర్వం పెళ్ళి కూతుర్ని పెళ్ళికొడుకుగాని, పెళ్ళికొ"డుకును పెళ్ళి కూరుతుగాని ముందుచూసుకోవడాలు ఉండేవికావు.  పెద్దహాళ్ళే చూసి