పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/447

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చె డు గు డు

      ఈ ఆటలో ప్రత్యేకత కొంగుతిరగడమనేది.  ఇటూ అటూ రెండు జట్లూ సరిసమానంగానిలిచి అవతలజట్టునుంచి ఒకడు యివతలికొంగులోనికి వచ్చి కూస్తుంటాడు.  దీన్నే కొంగుతిరగడమంటారు.  ఇందులో విచిత్రం ఇవతలికొంగులోకూసేవాడు నేర్పుగావెనక్కివచ్చి అవతలికొంగులోకూస్తున్నవానిని పట్టేస్తే మిగిలినవాళ్ళు కదలకుండానొక్కేస్తారు.  అతను అవుటు. కూతకు వెళ్ళీనచానిని అవతలిజట్టుపట్టేసుకున్నా అతనుకూతఆపకుండా ఎలాగోలాగ విదిపించుకొని కొంగు ముట్టేసుకుంటే ఆ పట్టుకున్నవాళ్ళంతా అవుటు.  ("కొంగు" అంటే రెండు జట్లకూ మధ్య గీసిన సరిహద్దు గీత) కూత ఆపినప్పుడు ఆ కొంగులోవాళ్ళు అతన్నిముట్టుకుంటేచాలు కూసేవాడు అవుటు. ఇప్పటికి "కబాడి" ఆటలాగ మార్కులపద్దతిగాక అవుటయినవాళ్ళని పూర్తిగా ఆటనుంచి తప్పించడం దీనిలోని పద్దతి.  ఇందులో బలహీనంగా ఉన్నపక్షానికి ఒక మనిషిని అదనంగాయిస్తారు.  ఇతన్ని 'సత్రకాయ ' అంటారు.
    కూత 'అరిబలి చెడుగుడు చెడుగుడు చెడుగుడు ' అంటూ దమ్ము ఉన్నంతవరకూ ఆగకుండాకూయాలి.  కొంతమంది 'చెట్టుకొట్టగా