Jump to content

పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/448

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ము క్కా లా ట

      ఇద్దరేసిమనుషులుజట్టుగా ఒకరికుడికాలు, రెండవారి ఎడమకాలు మడమలదగ్గర రుమాలుతో గట్టిగాకట్టుకొని పరుగుపెట్టాలి.  ఇలా కొన్ని జట్టులు ఏర్పరచి అందరెనీ వదులుతారు.  వీరిలో అవరయితే నిర్ణీతస్థలాన్ని ముందుచేరతారో వారిదే బహుమతి.
                      వొం గు దూ కు ళ్ళు
  ఒకరు కూర్చొని ఒకకాలు చాపుతారు.  మిగిలినవాళ్ళు దానిని దాటాలి. తరువాత ఆ కాలిబొటనవ్రేలుపై రెండవకాలిమడమ పెడతారు.  అది దాటితే దానిపై కుడిచేయివ్రేళ్ళుచాపి జానపెడతారు.  అదీదాటితే దానిపై ఎడమచేతివ్రేళ్ళ జాన పెడతారు.  అదీ దాటితే కూర్చున్న మనిషి లేచి కాలిబోటనవ్రేలిని చేతినడిమివ్రేలుతో తాకుతూ వంగుంటారు.  దానిపైనుంచికూడాదాటితే మోకాళ్ళమీదా, ఆ తరువాత చేతులుకట్టుకుని మెడ వంచుకొని నిలబడతాడు.  ఇక్కడికి సుమారు అయిదడుగుల ఎత్తువస్తుంది.  ఈ భంగిమలు వివిధ స్థాయిలలో ఎత్తును పెంచుకొని పోవడమన్నమాట.  ఈ దాటేటప్పుడు కాళ్ళు ఎక్కడా వంగినవ్యక్తికి తగలకూడదు.  వంగున్నప్పుడుమాత్రం అతనిమీద చేతులువేసి దాటవచ్చు.  ఏస్థాయిలో కాళ్ళు తగిలినా దాటలేకపోయినా మొదటి వ్యక్తికి బదులు తనుకూర్చొని యీ భంగిమలు పెడుతుంటే మిగిలినవారు దాటు తుంటారు.  ఇది ఆనాటి "హైజంప్".
           జానపదుల ఆటలు, క్రీడలు ఇటువంటివి ఎన్నోఉన్నాయి.  ఆదినుండీ యివి మౌభికంగానే వచ్చాయి తప్ప ఎక్కడా లిఖితంకాలేదు.  ఇప్పుడు క్రమంగా కాలగర్భంలో కలసిపోతున్నాయి.  పరిశోధకులెవరైనా ప్రయత్నించి దేశవ్యాప్తంగా వీనిని సేకరించి భద్రపరిస్తే ముందుముందు క్రీడారంగచరిత్ర వ్రాయడానికి ఉపయుక్తం కాగలదు.