పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/446

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లను ముందుకుకొడుతూ బిరిదాటించాలి. అలా కొట్టినప్పుడు ఆ కర్రల మీద తనకర్రఉండిపోతేకూడా కొట్టేవాడు అవుటే. ఆ బిరిని ఎన్నిసార్లు దాటిస్తే అన్ని ఆటలునెగ్గినట్టు. ఒక్కోఆటకు ఒక్కో"కొత్తెం"యివ్వాలి. "కొత్తెం" అంటే ఆటకొట్టినవారు తమకర్రతో అవతలికర్రన్ తమకిష్టమొచ్చినచో'ట ఒకపోటు పొడవడం, ఒకలక్ష్యాన్ని సూటిగకొట్టడం యిది నేర్పుతుంది.

                               ఉ ప్ప ట్టి
             నీళ్ళతోగాని, ముగ్గుతోగాని నాలుగుబారల వెడల్పున, రెండుబారల ఎడముతో నాలుగుగీతలు పోస్తారు.  ఈ గీతలనే 'పట్టెలు ' అంటారు.  మొదటిపట్టెనూ చివరిపట్టెనూ కలుపుతూ ఆ చివరా ఈ చివరా గీతలుపోసి వానిని కలుపుతారు. అప్పుడు అవి మూడుకానాలుగా ఏర్పడతాయి.  ఈ కానాలలో మళ్ళీ మధ్యగా మొదటిపట్టెనూ, చివరిపట్టేనూ కలుపుతూ ఒక పట్టేను పోస్తారు.  జట్టుకు అయిదుగురుచొప్పున రెండుజట్లుగా విడిపోతారు.  ఒకజట్టు పట్టెకుఒక్కొక్కరుచొప్పుననిలబడి ఆతూయిటూ బారజాస్తూ రెండవజట్టువాళ్ళని అవిదాటి వెళ్ళనివ్వకుండా కాపలాకాయాలి.  మధ్యపట్టే ఈకొసనుంచి ఆకొసకు ఒకరే కాపలా.  ఈ ఆటలో "దూరింగు బుడత" అని ఇరుపక్షాలకూ యిష్టమైనవ్యక్తిని అదనంగా పెడతారు.  అతను ఎప్పుడూ దూరేజట్టులోనే ఉంటాడు.  దీనితో దూరేవాళ్ళు ముట్టుకుంటే దూరేవ్యక్తి అవుటయిపోయినట్టు.  దూరేటప్పుడు కాసేవాళ్ళు ముట్టుకుంటే దూరేవ్యక్తి అవుటయిపోయినట్టు.  అయితే ఆ వ్యక్తే తిరిగి చివరికంటా రానక్కరలేదు.  వెనక్కివచ్చేటప్పుడు మూడవగడిలో నున్న తన జట్టువాణ్ణి కలిస్తే, అతను ఒకటచ గడిలోని వాణ్ణి కలిస్తే, ఆ ఒకటవగడిలోనివాడు బయటకు రాగలిగినా జయమే.  దీన్నే "ఉప్పు అందివ్వడము" అంటారు.  అలాచేయలేకపోతే మరల రెండవజట్టుకు దూరే అవకాశం వస్తుంది.  ఇందులో మనిషి లోపలికి చొరకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, కాస్తున్నవాడికి దొరక్కుండా లోనికిప్రవేశించేనేర్పూ అలఫడతాయి. కొన్ని ప్రాంతాలలో దీనికి "చెఱ్ఱాట" అనిపేరు.
  *"ఉప్పెనబద్దెలాడునెడ నుప్పులు దెత్తురుగాకే యాదవుల్"

  • ఉత్తరహరివంశం. నాచన సోమనాధుడు.