Jump to content

పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/442

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గో ళీ కా య లా ట

                అంతరిక్షంలో గ్రహాలగమనం పరికిస్తే ఆకాశంలో దేవుడు గోళీకాయలాడుతున్నాడా! అనిపిస్తుంది.
          గట్టిసిమెంటుతో చేయబడ్డగుండ్రని నునుపైన గోళీకాయలు ఫేన్సీషాపుల్లో అమ్ముతుంటారు.  ఆటగాళ్ళు రెండు జట్లుగావిడి నేలమీద ఒక చిన్న వలయంగీసి, దానికిసుమారు ముప్పదిఅడుగులదూరంలో ఒక బిరిగీస్తారు.  బొమ్మా, బొరుసు వేసుకొని బొరుసువచ్చిన జట్టు తమ గోళీకాయలు ఆ వలయంలో పెడతారు.  రెండవజట్టు బిరిమీదనిలచి నానిదగ్గరకు తమగోళీలు విసిరి అక్కడనుంచి ఆవలయంలోని గోళీలన్నింటినీ తమ గోళీలతో కొడుతూ బిరిదాటించాలి.  కొట్టడం అంటే మామూలుగా కొట్టడంకాదు.  చూపుడువ్రేలుతోగాని, నడిమివ్రేలుతోగాని పై భాగంచివర గోళిపెట్టి రెండవచేతితో వెనక్కిలాగి బాణంలా ఎక్కుపెట్టి వదలాలి.  ఈ ఆటలోచూపుడువ్రేలుకు మరోపేరు "లొడితేలు", తనగోళీదగ్గరనుంచి ఒక జానదూరంకొలిచి అక్కడనుంచి అవతలగోళిని కొడతారు.  ఇందులో గోళీలను కాయలని పిలుస్తారు.  ఆకాయకు తనగోళీ దూరంగాఉంటే "కావన్నారి" అంటూ దానిదగ్గరకువిసిరి, అక్కడనుంచి దానిని ఎదటికికొడతారు.  ఈకావన్నారిని ఒక దెబ్బకుముందు ఒక్కసారిమాత్రమే పొయ్యాలి.  అవతలికాయి దగ్గరగాగానీ ఉంటే "అక్కడికక్కడ కావన్నారీ" అనితిన్నగా చెబ్బకొట్టేస్తారు.  ఎప్పుడు కాయను కొట్టలేకపోతే అప్పుడు అతను అవుటు.  ఇలాగ ఆ జట్టు ఆ జట్టువాల్లు అవతిలిజట్తువారి అన్నికాయలను బిరిదాటిస్తేవ్ తరువాతఆటకూడా మళ్ళీవాళ్ళదే.  ఏ ఒక్కటి మిగిలిపోయినా అందరూ అవుటయిపోయినా వాళ్ళ ఆట పోయినట్టే.  అంతేకాకుండా కొట్టేవాని కాయ బిరిదేటితేకూడా ఆ కొట్టినవ్యక్తి అవుటయిపోతారు.  దీన్ని "కావన్నరి" ఆట అండారు.
          ఇందులో గుంటలాట మరొకటిఉంది.  ఒకచోట చిన్నగుంటత్రవ్వి దానికి ఇరవయిబారలదూరంలో గీతగీసి అందరూ అక్కడికుండి తమ గోళీలను విసురుతారు.  గుంటకు ఎవరు అక్కవదగ్గరపడితే వారు ఒక జానదూరంకొలిచి అక్కడినుంచి వ్రేలుతో  గోళిని గుంటలో వేయడంగానీ