పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/441

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పట్టుకుని లాఘవంటొ క్రిందికి విసిరితే అది క్రింద గిర్రున తిరుగుతుంది. వేంకటపార్వతీశ్వరకవుల చేతుల్లో వస్తువుగా ఇది ఎలా తిరిగిందో చూడండి.

                        "రింగు రింగున తిరుగు నా బొంగరబు
                          ఏమియో వ్రాచుచున్నదీ యిసుకలోన
                          బడికి పోలేదు పొత్తంబు పట్టలేదు
                          ఎట్లు వచ్చినదో దీనికింత చదువు" అంటారు

     ఈ బొంగరాలతో ఆట బలే గమ్మత్తుగావుంటుంది.  అడేవాళ్ళంతా వాళ్ళా బొంగరాలకు త్రాళ్ళుచుట్టి సిద్ధంగా ఉంటారు.  ఒకరు ఓకటీ, రెండూ, మూడూ అనగానే అందరూ ఒకేసారి బొంగరాలు నేలబారున విసిరి అవి తిరుగుతుంటే అవళ్ళమట్టుకువాళ్ళు తమ బొంగరాల్నితమ త్రాళ్ళతో పైకెగరేసి ఎవరయితే ఎవరైతే ముందు అందుకుంటారో వారుగెలిచినట్టు.  మిగతావాళ్ళంతా తమ బొంగరాలు నేలమీద తగుమోస్తరు వలయంగీసి అందులోపెడతారు.  ఈ నెగ్గిన ఆటగాడు తన బొంగరానికి త్రాడుచుట్టి వానిమీదికి విసురుతాడు.  దానిముల్లు అక్కడ కొన్నింటికి కన్నాలు పొడిచి తిరుగుతుంటుంది.  దాన్ని మరల ఆ బొంగరందారుడు త్రాడుతో పైకిఎగరేసి అందుకోవాలి.  అలా అందుకోలేకపోతే మళ్ళీ ఆట మఒదటికి వస్తుంది.  అలా పొడిచిన కన్నాలను "పుచ్చా" అంటారు.  ఒక్కొసారి ఆ బొంగరం తగలడంతో ఆ వలయంలోని కొన్ని బొంగరాలు గీతదాటి బయటకు వచ్చేస్తాయి.  అప్పుడు ఆ బొంగరాలతాలూకువాళ్ళు కూడా తొలివ్యక్తిలాగే వలయంలోని బొంగరాలను కొడుతూ ఆడవచ్చు. అన్ని బొంగరాలూ బయటికివచ్చేస్తే అందరూ నేలబారున బొంగరాలను త్రిప్పి మొదటిలాగే ఆడతారు.
    ఈ ఆట బొంగరం త్రిప్పడంలోనేర్పరితనం, గురిచూసికొట్టగలడం, అవకాశం ఎప్పుడువస్తుందాఅని ఏమరుపాటులేకుండా చూసుకుంటుండడం ముఖ్యం.  ప్రఖ్యాత జానపద "రాములమ్మకధ"లో ఈ బొంగరమే కధను క్లయిమాక్సుకు తీసుకేడుతుంది.  శ్రీనాధుని పల్నాటిచరిత్రలో బాలచండ్రుని యుద్దోన్ముఖుని చేసిందికూడా ఈ బొంగరాలటే.