Jump to content

పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/440

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అవివస్తున్నంతసేపూ కొట్టవచ్చు. కొట్టినప్పుడు ఒక్కటెంకకూడా చిరిదాటిరాకపోయినా, కొట్టేటేంక చిరిలోఉండిపోయినాఅతని ఆటపోయినట్టే. అప్పుడు తరువాతదగ్గవానికి అవకాశంవస్తుంది. అలాగే క్రమంగా అందరికీను. గుడిలో ఇంకా టెంకలుండగానే అందరూ అవుటయిపోతే మరల మొదటిలాగే టెంకలు గుట్టలో పెడతారు. ఇందులో ఎవరు ఎక్కువ టెంకలుగెలిస్తేవాళ్ళు గొప్ప. ఈ ఆటలో మనిషికి గురి అలవడుతుంది. నేటి "బచ్చాలాట"కి యిదేమూలం.

                       కు ప్ప త న్ను లా ట
      టెంకలాటలోలాగే ఆరడుగుల వ్యాసార్ధంలో ఒకవలయంగీసి, అందులో మధ్యగా ఇసుకకుప్పపెట్టి, దానిలో చిన్నరాయిపెట్టి కప్పెడతారు.  దానికి పది ఆడుగులదూరంలో ఒక సంకేతంపెట్టి, పంటాలువేసికొని నిర్ణయిస్తారు.  దొంగ కుప్పచుట్టూఉన్న వలయంమీదజ్ తిరుగుతుంటాడు.  మిగిలినవారు అతనికి దొరక్కుండా వలయంలోకివెళ్ళి కుప్పను తన్నుతుండాలి, అలా తన్నినప్పుడు కుప్పలోనిరాయి బయటికివస్తే దొంగ నిర్ణీతసంకేతాన్ని ముట్టుకువచ్చేదాకా అతన్ని వీపుమీద గుద్దులు గుద్దుతుంటారు.  దొంగ్ అది ముట్టుకువచ్చేలోగా ఆరాయిని కుప్పలోపెట్టి కప్పెయ్యాలి. అలా కప్పెట్టేలోగా దొంగ సంకేతాన్ని ముట్టుకువచ్చేసి అవరినైనా ముట్టుకుంటే వాళ్ళు దొంగ.  కుప్పను తన్నేటప్పుడు వలయంలో దొంగ ఎవరినైనా ముట్టుకోగలిగితేకూడా వారు దొంగే.  ఈ ఆట మనిషికి చురుకుదనాన్నీ, మెరుపుదాడుల్నీ నేర్పుతుంది.
                            బొం గ రా లా ట
     కర్రతో చేయబడ్డ బొంగరాలు యిప్పటికీ తీర్ధాలలో అమ్ముతుంటారు.  గుండ్రంగా, తలబాగం పెద్దదిగా (గోపురం పోలిగ్గా) మధ్యబాగం మూడు నాలుగు మెట్లుగా తగ్గుతుంటూవచ్చి, క్రింద చిన్న బొడిపెవంటిది ఉండి, దాని అడుగున మధ్యలో ఒక ఇనుపముల్లు ఉంటుంది.  ఆ ముల్లు దగ్గరనుంచి మెట్లచుట్టూ తలవరకూ నులకత్రాడుగానీ, నవారుత్రాడుగానీ చుట్టి, త్రాడుచివర చూపుడువ్రేలుకీ, బొటనవ్రేలుకీ మధ్య