Jump to content

పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/443

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రక్కకాయను కొట్టడంగానీ, లేదా "కావన్నారీ" అని గుంటదగ్గరకు వెయ్యడంగానీ చెయ్యాలి. అది గుంటలో పడినప్పుడూ, కాయను కొట్టీ నప్పుడూ ఒక్కోమార్కు వస్తుంది. పది మార్కులు తెచ్చుకుంటే తను పండినట్టు. ఇలా పండినవాళ్ళు తప్పుకుంటూ మిగిలినవాళ్ళు ఆడుకుంటారు. ఇక్కడ లెక్కలలో ఒక విశేషముంది. కాయను రెండుసార్లు గుంటలోవేసి, ఆ వచ్చిన రెండుమార్కులూ చెల్లుచేసుకుని గోళీనికొడితే అయిదు మార్కులువస్తాయి. ఇలా చెల్లుచేసుకుని గోళీని కొట్టలేకపోతే మొదటి రెండుపర్యాయాలూ కూడా పోతాయి. అయిదుతరువాత గోళీనికొడితే తొమ్మిది మార్కులు. ఆ తరువార పదమార్కు, గుంటలోవేసి తెచ్చుకోవాలి. మరోనియమం ఏమిటంటే గుంటలో గోళెవెని తొమ్మిదిసార్లువేసి తొమ్మిదిమార్కులు సంపాదిస్తే పదవమార్కుకు మాత్రం గోళీని కొట్టాలి.

              ఇలా ఆడగా ఆడగా చివరకు ఒకరు మిగులుతారు. అతను పండిన వాళ్ళందరికీ ఒకరితరువాత ఒకరికి "పిలికీలు" పెట్టాలి.  "పిలికీ" అంటే పండినవారు గుంటదగ్గర తనగోళీఉంచి కూర్చుంటాడు.  ఓడినవాడు గీత అవతలికి వెళ్ళి ముందుకువంగి తన రెండుకాళ్ళమధ్యనుంచీ గోళీ విసిరి అక్కడినుంచి గుంటవేపు అరచేతితోనూ, మోచెయ్యితోనూ గెంటుతారు.  దీన్ని 'డేకడం ' అంటారు.  దేకేటప్పుడు ఆ కాయవెళ్ళి గుంటదగ్గరకాయను తగలడంగానీ, గుంటలో పడడంగాని జరగాలి.  అలా జరక్కుంటే గుంటాదగ్గరున్నవారు తనకాయతో ఆ డేకబడ్డకాయను మరింత దూరంగ్తా కొడుతుంటాడు.  ఆ దెబ్బగానీ దీనికి తగలకుంటే యితను తనకాయ మరల ముందు డేకుతాడు.  ఈ పిలికీల్లోనే ఉన్నది.  ఆటమజా.
    మొత్తంమీద ఈ గోలీకాయలాట మనిషికి నిదానం, గురి నేర్పుతాయి.
                            గూ టి బి ళ్ళా ట
       ఈ ఆటను హిందీలో 'గిల్లీదండా ' అంటారు. నాచన సోమ్ని ఉత్తర హరిఫంశంలో దీనిని 'గిల్లదండా అని వాడేడు.  ఒకచోట మూడు అంగుళాలలోతు గుంటను చిన్నగాడిలాత్రవ్వి, ఆ గాడిమీద ఆరంగ్ళాలపుల్ల అడ్దుగాపెట్టి (దీనినే బిళ్ళ ఆంటారు), ఒక గజంకర్రముక్కతో ఒకరుదానిని గుంటలోనుంచి ఎదుటికి గూటతారు.  ఆ యెదుట ఒకరు