పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/427

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నట్టునటించడం, ఈ మర్మాన్ని ఎదుటివాడుపసిగట్టి సరిగ్గా ఆపుల్లపెట్టిన చోటును పట్తుకోవడం. ఈ ఆటవల్ల మోసాన్ని కనిపెట్టే శక్తిఅలవడుతుంది. ఈ విధముగా 5గాని, 7గాని, 9గాని ఆటలు ఎవరుముందుగెలిస్తే వారు పూర్తిగా గెలిచినవారిక్రింద లెక్క. ఒక్కోఆటలో గెలిచినప్పుడల్లా గుర్తుకోసం వారిప్రక్కన ఒక్కో చిన్న ఇసుకప్రోగు పెడుతుంటారు. గెలిచిన వారు తమయిసుకపోగులు ఓడినవారిదోసిటలోపోసి ఆపుల్లముక్కను ఆ దోసిటలోని యిసుకలో పెట్టి వారికండ్లకుగుడ్డకట్టి, లేదా తనచేతులతో అతని కళ్ళుమూసి, ఆటఆడినస్థలమునుండి దూరంగాతీసుకుపోయి ఎక్కడోఒకచోట దోసిట్లోని ఇసుకను పుల్లముక్కతోసహా క్రిందపోయించేసి, కళ్ళు అలా మూసిఉంచే ఆటఆడినస్థలందగ్గరకు తీసి కెళ్ళి కంటిగుడ్డ విప్పేస్తారు. కళ్ళూమూసి తీసికెళ్ళేటప్పుడూ, తీసుకొచ్చేటప్పుడూ ఒకేత్రోవలో తీసికెళ్ళకుండా ఆనవాళ్ళు దొరక్కుండా ఉండడానికి అటూయిటూ వెనక్కి ముందుకూ త్రిప్పుతారు. తంతలు విప్పాక ఆవ్యక్తివెళ్ళి తానుపోసిన ఇసుక, పుల్ల గుర్తుపట్తి తీసుకురావాలి.

                        గ ట్టూ మీ దా కో డి
   పిల్లలు రెండువరుసలుగా విడిపోతారు.  ఒక్కొక్కజట్టూ ఒక్కోనాయకుని ఎన్నుకొన్నతర్వాత ఉభయజట్టులవారూ సుమారు గజందూరంలో ఎదురెదురుగా కూర్చుంటారు.  ఒకజట్టు ఎదుటిజట్టుకు కనిపీంచకుండాఉండేటట్లు చేతులువెనకికి పెట్టుకుని చిన్న దూదిఉండగాని, పుల్లముక్కగాని చేతుల్లో ఒకరినుండి మరొకరికి నడుపుతూ "గట్టూమీదాకోడి, గవ్వల్లాకోడి, తొక్కితే తొంబయ్యి పిల్లల్లాకోడి, అల్లల్లాకోడికో ఆకుమీరియమ్మా, పిల్లల్లాకోడికి పిండీమిరియడమ్మూ, ఆడుక్కోబుడుక్కో సాంబారు బుడ్డి" అని పాడి అందరూ గుప్పెళ్ళు ముడిచి ముందుకుచాపి ఎవరిచేతిలో వుందోచెప్పుకోమంటారు.  రెండజ్ట్తువారు తమలోతాము సంప్రదించుకుఇ తమనాయకునిద్వారా చెప్పిస్తారు.  ఫలానావారిదగ్గరఉందని.  సరిగ్గా వాళ్ళుచెప్పినవారి చేతిలోవుంటే ఆపుల్ల రెండవజట్టువారిచేతికి వస్తుంది.  వాళ్ళూ అలాగేచేస్తారు.  ఒకవేళ తప్పుచెబితే ఎదుటిజట్టువారు సరిగ్గాచెప్పేవరకూ మొదటిజట్తుచేతుల్లోనే ఆపుల్ల తిరుగుతుంటుంది.  ఈ ఆట ఆయాసం, ఆలోచన అక్కరలేనివిదయినా ఎదుటివారిచేష్ఠలనుబట్టి పసిగట్టే జ్ఞానాన్ని కలిగిస్తుంది.  సంప్రదింపులద్వారానిర్ధారణ అనే ప్రజాస్వామ్యపు పద్దతిని పిల్లలకు నేర్పుతుంది.