పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/428

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సర్లూ, టి క్క లాట

      ఇది మరీ తేలుకైనఆట. శీతాఫలగింజలు ప్రోగుచేసితెచ్ తెచ్చుకుని స్త్రీలు ఎదురెదురుగా కూర్చుంటారు. ఒకరు తమగుప్పెట్లో కొన్నిగింజలుదాచి ఎదువారిని అవి ‘పర్లా ‘, ‘టిక్కలా ‘ అనిఅడుగుతారు. ‘పర్లూ ‘ అంటే సరి సంఖ్య అనీ, ‘టిక్క ‘లంటే బేసి సంఖ్య అనీ అర్ధం. ఎదుటివారు ‘పర్లు ‘అంటే గుప్పెట్లోవి లెక్కపెట్టిచూసి అవి సరిసంఖ్యలో ఉంటే ఆగుప్పెట్లో ఉన్నన్నీ గింజలూ ఎదుటివారు ఇచ్చుకోవాలి. తరువాత అదేవిధంగా ఎదుటివారుచేస్తారు. చివరికి ఎవరికి ఎక్కువ గింజలు లాభిస్తే వారుగెలిచినట్టు. ఇది ఖరీదులేనిజూదం - కలహాలులేని కాలక్షేపం - పెండ్లిడ్లలో పానుపులేసి వధూవరులచేతకూడా రూపాయలతో ఈ ఆట ఆడించే వారు వాళ్ళను దగ్గరచేయడానికి.
                  గె చ్చ న రా ళ్ళా ట
     దీనినే గెచ్చనకాయలాట అనికూడాఅంటారు. *”పూర్వమీయాటన ‘షత్పాషాణక ‘మని పిలిచేవారట“. సిమెంటురంగులోపచ్చని చిన్నచిన్న నునుపైన గుండ్రనిరాళ్ళు గంగిరెడ్లస్త్రీలు వీధుల్లో తిరుగుతూ అమ్ముతుంటారు. వాటికి గెచ్చనరాళ్ళు అనిపేరు.  ఆడపిల్లలు పదకొండురాళ్ళు తీసికొని కూర్చుని ఒకరాయిని పైకివిసురుతూ క్రిందరాయినొకదానిని గుప్పెట్లోకితీసి, పైకివిసిరినరయిని అదేగుప్పెట్లోకి అందుకుంటారు. ఇలా చేసేటప్పుడు మామూలుగా ఒకటి, రెండూ, మూడు అని లెక్కించడానికి బదులుగా “ఒక్కా ఓచెలియా, రెండూరోకళ్ళు, మూడూ ముచ్చిలకా, నాలుగూ నందెన్నా, అయిదూ చిట్టిగొలుసూ, ఆరుందారాలు, ఏడుంబీడీలు, ఎనిమిది వెన్నముద్ద, తొమ్మిది తోకుచ్చు. పదీ నట్టీడ“అని పాడుతూ పదీ లెక్కిస్తారు. పదివరకు ఆడితే ఒకఆట. ఎక్కడయినా పైకివేసినరాయి చేతిలోపడకుండా క్రిందపడితే అక్కడ ఆట అయిపోయినట్టు. వెంటనే రెండవవారు ప్రస్రంభిస్తారు. అదేవిధంగా ఎవరుఎక్కువ ఆటలుకొడితే వాళ్ళు గొప్ప. ఇది ఏకాగ్రతకు, వ్రేళ్ళ పరిశ్రమకు సంబందించిన ఆట.

———————————————————————————————————————————————————————-

  • వాత్సాయన కామత్రానూలు- కన్యాసంప్రయుక్తాధికరణము బాలోపక్రమోద్యధ్యాయ పు.7 (3-3-7)