పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/426

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాలుగు స్థంభాలాట

దీనికే "గొల్ల చల్లాట" అని కూడా పేరు. పంటలు వేసికొని అందులో ఒకరు దొంగకాగా మిగిలిన నలుగురూ నాలుగు స్థంభాలూ పట్టుకొని ఉంటారు. (సాధారణంగా గుమ్మాల ముందు వేసే పెళ్ళిపందిళ్ళలో ఈ ఆట ఆడేవారు) దొంగ "చల్లోయమ్మ గొల్లచల్ల" అంటూ నెత్తిమీద చేతులు పెట్టుకొని ఆ కొసనుండి ఈ కొసకి, ఈ కొసనుండి ఆ కొసకి తిరుగుతుంటే స్తంభాలు పట్టుకున్నవాళ్ళు దొంగను దూరంపోనిచ్చి ఒక స్తంభం నుండి మరో స్తంభానికి అటూ ఇటూ మారుతుంటారు. ఈ మారడంలో తాను వదిలేసిన స్తంభానికి మరొకరుగాని, తిరిగి తానుగాని పట్టుకొనేలోపున దొంగ ఆ స్తంభాన్ని ముట్టుకుంటే ఆ స్తంభం దొంగది. అప్పుడు స్తంభం లేకుండా మిగిలిపోయిన వ్యక్తి దొంగ. ఈ ఆట పిల్లలలో నిశితమైన చూపు, ముందుజాగ్రత్త నేర్పుతుంది. ఈదొంగను ' గొల్లభామ ' అంటారు. ఈ గొల్లభామ చల్లోయమ్మ గొల్లచల్ల అని పాడుతూ -

" నాలుగు స్తంభాలాట నడిమికి తొడిమికి
తానక తప్పక తన పేరేమిటి
ఉట్టిమీద బెల్లం, పొట్టి కాకరకాయ"

అంటూ కూడా పాడుతూ, కాళీ స్తంభం కోసం వెతుకుతూ తిరుగుతుంటుంది. ఈ ఆట నేటి మ్యూజికల్ ఛైర్సుకి దాదాపు ప్రతిరూపమే.

                      దు క్కు డు పు ల్లా ట
    ఇసుకతెచ్చి చిన్న గట్టుమాదిరిగాపేర్చి, ఎదుటివారుచూస్తుండగానే ఒకరు చిన్నపుల్లముక్క ఆ యుసుకలోదూర్చి, లోపల దానినిముందుకూ వనక్కూనడుపుతూ, "దుక్కుడుపుల్ల, దూదుగపుల్ల, పొయ్యిలోపెడితే పండుగపుల్ల" అని పాడుతూ తనుఎక్కడపుల్లఉంచాడో తెలియకుండా పైన యిసుక కప్పేస్తాడు.  రెండవవ్యక్తి తనరెండు అరచేతులనూ వ్రేళ్ళల్లోకిజొనిపి ఆ పుల్లవున్న భాగంపై పెట్టాలి.  చేతులు ఆన్చినభాగంలో పుల్లఉంటే పుల్లపెట్టినాఅరుఓడినట్టు.  అప్పుడు ఎదుటివానికి పుల్లపెట్టే అవకాశం వస్తుంది.  చేతులుఆన్చినభాగంలో పుల్లలేకుంటే మరలపుల్ల పెట్టినవానికే అవకాశం.  ఈ ఆటలో విశేషం పుల్ల ఒకచోటపెట్టి వేరేచోటపెట్టి