Jump to content

పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/410

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వదునుపరీక్షిద్దామని ప్రక్కనున్న పొదను ఒకవ్రేటుతో నరికాడు. ఆ దెబ్బకు పొదలోనున్న జంబుమాలిని శిరస్సు ఖండింపబడింది. తరువాత అక్కడికివచ్చిన శూర్పణం విషయంతెలిసికొని రోషారుణనేత్రాలతో రాముని దగ్గరకువచ్చి ఆ సుందరాకారంచూసి మోహిస్తుంది. మిగిలిన కధ తెలిసిందే. ఈ కల్పనవల్ల శూర్పణం రాకకు కార్యకారణ సంబంధం ఏర్పడింది.

  ఇక సుందరకాండలో ఆంజనేయుడు రావణకొలువులో తనవాలాన్ని పెంచి రావణునికంటె ఎత్తునకూర్చొని తన అధిక్యాన్ని ప్రదర్శించాడనేదికూడా బుద్దారెడ్దికలనమత్రమే.  జానపదుల్ హనుమంతుని అభిమానిస్తారు. గనుక అతనిచేత ఇలా చిత్రాలుచేయిస్తే రామాయణం బాగావారిని అలరిస్తుందనే ఉద్దేశ్యంతోఈ విచిత్ర కల్పన చేసిఉంటాడు.  అలాగే రామాయణంలోని ఉడత కూడా తెల్గు ఉడుతే.  ఈ చిన్ని సంఘటనతో జానపదుల హృదయాలలో భక్తిబీజాన్ని బలంగా పాదుకొల్పాడు.
   యుద్ధకాండలో రావణుని తలలూ చేతులూ ఎన్నిసార్లు ఖండించినా మళ్లీ మళ్లీ మొలుస్తునాయట.  అప్పుడు విభీషనుడు చెబుతాడు  రానణునినభిదగ్గర అమృతభాండంఉన్నదనీ దానిని పగలగొట్టితేగాని అతడు చావడనీను.  ఏడేడు సముద్రాల కవతల మర్రిచెట్టుంది ఆ మర్రిచెట్టు తొర్రలో చిలకుంది.  ఆ చిలకబొందిలో ఫకీరు ప్రాణముందు అని బాలనాగమ్మ కధ చివర కధకుడు చెబుతుంటే జనం విస్తుబోయి ఆసక్తిగా వినడం చూసుంటాడు బుద్ధారెడ్డి.  దానిని జనం నాజూగ్గా మార్చి రావణుని ప్రాణానికి తగిలించి ఉంటాడు.  ఉత్సుకతను రేకెత్తించే అద్బుతకల్పన యిది.  మూలరామాయణంలో ఈ ఘట్టంలో ఇంద్రసారధి మాతలి రాముని బ్రహ్మాస్త్రం ప్రయోగించమంటాడు.  రాముడలాచేయగా రావణుడు చస్తాడు.  కాని బుద్ధారెడ్దిమలుపు కధకు మంచి మసాలా.  ఇదే జానపద కధలలోని పట్టు.  
   ఊర్మిళాదేవి నిద్రకూడా ప్రత్యేకించి జానపదస్త్రీల నాకర్షించడానికి చేస్న మరో అద్భుత కల్పన.

"పదునాలుగేండ్లును పగలును రేయి
నిదురవోవకనుండ నియమంబు సేసి
ఆరాత్రి నిద్ర మయా రూపు దాల్చి
ధీరుడా లక్ష్మణ దేవుని చేరి