Jump to content

పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/409

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నొచ్చుకుంటుంటారు. కధవింటున్న జనం. ఈ చిన్న అతుకు కధకు అంత ప్రాణప్రదంగా నిలిచిందన్నమాట. రామాయణంలో ఇది ఎంతబలంగా అతుక్కు పోయిందంటే మూలంలోలేదని ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ నమ్మేటట్టులేరు. ఇది అప్పటికే జానపదులలో మంచి ప్రచారంలోఉన్న బాలనాగమ్మ కధలోనిది. కార్యవర్ధిరాజు యుద్ధానికి వెళుతూ బాలనాగమ్మను దాటవద్దని గుమ్మంలో మూడుగిరులుగీచివెళతాడు. మాయలఫకీరుకు ముష్టివెయ్యడానికి ఆమె అవి దాటిరావడంతో కధమలుపు తిరిగి ఉత్కంఠను రేకెత్తించి ఆద్యంతం ఆసక్తితో వినేటట్టు చేస్తుంది. రామాయణంలోకూడా అలాచేస్తే పామర జనాదరణ పొందుతుందని అ సంఘటనను ఇక్కడ చొప్పించి ఉండవచ్చు.

   ఇలాగే అహల్యాశాపఘట్టంలో చేసిన చిన్నమార్పు సహజంగాఉండటమే కాకుండా మూలానికె మెరుగుదిద్దింది.  వాల్మీకిరామాయణంలో గౌతముడు వేకువ్నేలేచి నదీస్నానానికి వెళతాడు.  ఇంద్రుడువచ్చి అహల్యను అనుభవిస్తాడు.  కాని రంగనాధరామాయణంలో ఇంకా రెండు ఝాముల ప్రొద్దుండగానే ఇంద్రుడు కోడైకూస్తాడు. తెల్లవారబోతోందని భ్రమసి గౌతముడు నదీస్నానానికి వెళ్ళిపోతాడు.  పల్లెలలో జారులు తమకడ్డుగాఉన్న పెద్దవాళ్ళను మభ్యపెట్టడానికిచేసే పన్నాగాలెన్నో చూసి దీన్ని ప్రవేశపెట్టి ఉంటాడు.  ఈ చమత్కారకల్పన రామాయణతల్పానికి సొగసుకూడా తెచ్చిపెట్టింది.  వాల్మీకిరామాయణంలో గౌతముడు అహల్యన్ "శిలానుప్రాప్య" అని అంటే రాయికమ్మని శపిస్తాడు.  మరి రాయికి కష్టాలేముంటాయి! బాధలెముంటాయి! రంగనాధరామాయణంలో అహల్య ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చలిలో వణుకుతూ, ధూళిదూసరితాంగియై అగతికయై పడియుండమని శపిస్తాడు గౌతముడు.  ఇప్పుడది శాపంఅనిపించుకుంటుంది విమర్శనాదృష్టితో చూస్తే. ఇలాంటిదే జంబుమాలిని అనేకొడుకునుకని రావణునిచంపి ప్రతీకారం తీర్చుకోమన్నది.  అతడు వావణుని చంపి ప్రతీకారం తీర్చుకోమన్నది.  అతదు రావణునిచంపే అస్త్రాలకోసం సూర్యుని గూర్చి ఘోరమైన తపస్సుచేస్తుంటే పైన పొదలుపెరిగిపోయాయి.  ఆతపస్సుకుమెచ్చి ఒకనాడుసూర్యుడు ఆకాశంనుంచి ఒకఖడ్గాన్ని పడెవేశాడక్కడ.  అదేసమయానికి అక్కడికివచిన లక్షణుడు ఆ ఖడ్గంతీసి












1