పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/408

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారతదేశంలో వీవిధ భాషలలోకి అనువదింపబడినా హిందీలో తులసీ తామాయణం, తమిళంలో కంబ రామాయణం, తెలుగులో రంగనాధరామాయణం ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయాయి. దీనికి కారణం పండిత పరంగానే కాకుండా పామరజన రంజకంగాకూడా ఆలోచించి ఏవేవి చొప్పిస్తే జనులంతా అనురక్తులుకాగలరో ఆటువంటివన్నీ చేర్చి పాఠకులకు భక్తిభవ సముద్రంలో ఓలలాడించారు. ఈ కవిపుంగవులు. నిజానికి వాల్మీమి కావ్యంలోని రాముడు ఉత్త(మ) మానవుడు మాత్రమే. కాని బుద్ధారెడ్ది రాముడు దేవుడు. తెలుగువారికి దైవభక్తి ఎక్కువ. ఈ నాడితెలిసిన బుద్ధారెడ్డి కరుణరసంతోపాటు భక్తిరసాన్నికూడా ప్రవహింపచేసి పామరజనాన్ని పరవిశింపజేశాడు. భరతానువాదం 11వ శతాబ్దంలో ఆరంభమైనా రామాయణాన్ని మాత్రం 14వ శతాబ్దివరకూ ఎవరూ ముట్టుకున్నట్టులేదు. ఈ శతాబ్దంలో వీర శైవ విజృంభణను చూశాడు బుద్ధారెడ్డి. సాహిత్యపరంగా చైతన్యవంతులనుచేస్తున్నవారి "దేశ" ప్రక్రియను పరికించాడు. స్త్రీల దంపుళ్ళపాటలు, ఏలపాటలు, జోలపాటలువంటి జానపదుల రసనాగ్రాలమీద నడుస్తున్న పదజాలంచూశాడు. వాటిని సంధించాడు. దేశీచందమైన ద్విపదను తీసికొని జానపదుల పదజాలంతో సరళ సుందరంగా, తేటతెల్లంగా, సామాన్యుడికి అర్ధమయ్యే పాటలా వ్రాశాడు రామాయణం. అందుకే తోలుబొమ్మలాటవాళ్ళు దీనిని చేబట్టారు. వీరు ప్రదర్శించేది రంగనాధరామాయణమే. మన ఇళ్ళల్లో స్త్రీలుపాడే ఊర్మిళాదేవినిద్ర, లక్ష్మణరేఖవంతివి ఇందులోని ఘట్టాలె. వాల్మీకి రామాయణంలో అసలు ఇవి లేనేలేవు.

  లక్ష్మణరేఖ విషయం వాల్మీకంలో ఎక్కడా కనిపించదు.  కాని దీన్ని రంగనాధరామాయణంలో ప్రవేశపెట్టి జానపదుల హృదయాలను ఆకట్టుకొనేటట్టు చేశాడు.  మారీచుడు రాముని స్వరంతో "హా లక్షమణా" అని కేకపెట్టినప్పుడు రామునికేదో ప్రమాదం జరిగిందని భయపడి సీత లక్షణుని వెళ్ళమని బలవంతంచేస్తుంది.  గత్యంతరంలేక కుటీరంముందు మూడుగీతలు గీసి "ఏపరిస్థితిలొనూ వీటిని దాటకు వదినా" అని చెప్పి వెళతాడు లక్షణుడు. రావణసన్యాసికి భిక్షవెయ్యడానికి ఆమూదుగీతలూ దాటిరాకుంటే సీత కడగండ్ల పాలయ్యేది కాదుగదాపాపం. అని ఎంతో